IND vs SL | అర్ధశతకంతో చెలరేగిన పంత్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం..!
IND vs SL : గాలే టెస్టుపై పట్టుబిగించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్(44), రిషభ్ పంత్(66) మినహా ఎవరూ రాణించలేదు.
IND vs SL : గాలే టెస్టుపై పట్టుబిగించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్(44), రిషభ్ పంత్(66) మినహా ఎవరూ రాణించకున్నా టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. మిడిలార్డర్ విఫలమైనా పంత్ తానె టెస్టుల్లోఎందుకు ప్రత్యేకమో చాటుతూ అర్ధ శతకంతో కదం తొక్కాడు. అయితే.. లంచ్ తర్వాత లంక పేసర్లు అసితా ఫెర్నాండో(4-31), ప్రభాత జయసూర్య(3-43)లు చెలరేగగా భారత్ 193కే పరిమితమైంది. లంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి భారత్.
తొలి మూడు రోజులు గాలే స్టేడియంలో అదరగొట్టిన భారత జట్టు నాలుగో రోజు తడబడింది. తొలి సెషన్ నుంచి శ్రీలంక పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వీ(0)ని అసితా ఫెర్నాండో డకౌట్ చేయగా, కేఎల్ రాహుల్(35)ను ప్రభాత జయసూర్యలు ఔట్ చేసి లంకకు బ్రేకిచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8) సైతం నిరాశపరచగా.. 81వద్దే మూడు వికెట్లు పడ్డాయి. అయితే.. తొలి ఇన్నింగ్స్ శతక వీరుడు దేవ్‌దత్ పడిక్కల్(44) నేను ఉన్నాగా అంటూ టీమిండియాను ఆదుకున్నాడు.
FIFTY for Rishabh Pant! ✅
He brings up his 20th Test half-century as #TeamIndia move closer to 160. 👍
Updates ▶️ https://t.co/WHXkfnivbw#SLvIND pic.twitter.com/qq6IlmSHbL
— BCCI (@BCCI) August 18, 2026
అనంతరం ధ్రువ్ జురెల్(7) సైతం విఫలమైనా.. రిషభ్ పంత్(66) తన స్టయిల్లో విజృంభించాడు. ఎడాపెడా బౌండరీలు బాది.. మెరుపు అర్ధ శతకంతో లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. టెస్టుల్లో 20వ హాఫ్ సెంచరీ, వంద సిక్సర్లతో అలరించిన పంత్‌ను లహిరు కుమార వెనక్కి పంపాడు. అంతే.. అక్కడితో టెయిలెండర్లను లంక బౌలర్లు చకచకా చుట్టేశారు. దాంతో.. పంత్ ఔటైన 19 పరుగులకే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భారత్… ఈసారి మాత్రం 193కే ఆటౌటైంది. అయినా కూడా.. ఆతిథ్య జట్టుకు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Innings break!
Rishabh Pant top-scores with 66(69) in the 2nd innings as #TeamIndia set a target of 3⃣7⃣2⃣ for Sri Lanka!
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/FAKQofDM5i
— BCCI (@BCCI) August 18, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

