న్యూఢిల్లీ: కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఇవాళ 2025 జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. 17 మంది క్రీడాకారులను అర్జున అవార్డు(Arjuna Awards) వరించింది. వరల్డ్‌కప్ విన్నింగ్ చెస్ ప్లేయర్ దివ్యా దేశ్ముక్, డెకాఅథ్లెట్, హైజంపర్ తేజస్విన్ శంకర్, షట్లర్ గాయత్రి గోపిచంద్ అర్జున అవార్డు జాబితాలో ఉన్నారు. గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజ్రాతీ, గాయత్రి డబుల్స్ పార్ట్నర్ ట్రెస్సా జోలీ, బాక్సర్ నరేందర్ బెర్వాల్, రైఫిల్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కూడా అర్జున గెలిచినవారిలో ఉన్నారు. సెలక్షన్ కమిటీ మొత్తం 24 మంది పేర్లను అర్జున అవార్డుకు రికమండ్ చేసింది. కానీ 17 మంది పేర్లను మాత్రమే అప్రూవ్ చేశారు. అర్హులైన క్రీడాకారులకు మాత్రమే అవార్డులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆటగాళ్ల జాబితాను చాలా కట్టుదిట్టంగా స్క్రీనింగ్ చేశారు. దీంతో అవార్డుల ప్రకటన సుమారు ఆర్నెళ్లు ఆలస్యమైంది. 2025 ఏడాదికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికీ దక్కలేదు. ఆ కేటగిరీలో ఈ సారి కేంద్రం ఎవరికీ అవార్డును ఇవ్వలేదు. 1962 ఆసియా క్రీడల గోల్డ్ మెడలిస్టు ఫుట్‌బాలర్ అరుమైనాయగం కు జీవితకాల సాఫల్య అర్జున అవార్డును ప్రకటించారు.
ఇక కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ఈసారి ముగ్గురు గెలుచుకున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్లో నేహ నందకుమార్ కు ద్రోణాచార్య అవార్డు దక్కింది. ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీలో బాక్సింగ్ కోచ్ ధర్మేంద్ర సింగ్ యాదవ్, రెజ్లింగ్‌లో వీరేంద్ర కుమార్‌కు అవార్డు దక్కింది.
𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐒𝐩𝐨𝐫𝐭𝐬 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 𝟐𝟎𝟐𝟓.
Badminton stars Treesa Jolly and Pullela Gayatri Gopichand, along with 15 other sportspersons from various disciplines, will receive the Arjuna Award for outstanding performance… pic.twitter.com/601Gu34n3Z
— SansadTV (@sansad_tv) August 18, 2026