హైదరాబాద్ : కొడంగల్ నియోజకవర్గంలో హకీంపేట మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ప్రభుత్వ భూమి విస్తీర్ణం పెంచి కోట్ల రూపాయల పరిహారం నొక్కేసారు. సీఎం ఆయన బినామీల పేరు మీద భూమి లేకున్న పరిహారం నొక్కేసారు. ఈ వ్యవహారం పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుపాలని ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు.
కోస్గిలో తిరుపతి రెడ్డి 100 ఎకరాల భూమి నీ కొనుగోలు చేశారు. అవన్నీ ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. సీఎం సతీమణి గీత బినామీ అయిన నర్సింహ రెడ్డి వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. అభివృద్ధి పేరు మీద దోపిడీ జరిగింది. నోటీస్ లు ఇవ్వకుండా పేదల ఇండ్లు నేలమట్టం చేస్తున్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..దీని మీద సమగ్ర విచారణ జరుపుతామని ఆయన పేర్కొన్నారు.