Mamata Banerjee | టీఎంసీ పార్టీకి కొత్త పేరు, కొత్త గుర్తు.. ఎన్నికల కమిషన్‌కు సూచించిన మమతా బెనర్జీ
Mamata Banerjee : టీఎంసీ పేరును, గుర్తును వాడుకునే అంశంపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ పేరు, గుర్తును మమత వర్గం, రెబల్ గ్రూప్.. ఎవరూ వాడుకోకూడదని ఆదేశించింది.
Mamata Banerjee : మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ పేరును, గుర్తును ఇటు మమత వర్గం, రెబల్స్.. ఎవరూ వాడకూడదని ఎన్నికల సంఘం గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీఎంసీ పార్టీలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రెబల్స్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీ పేరును, పార్టీ గుర్తు అయిన పూలు-గడ్డి గుర్తును తమకే ఇవ్వాలంటూ ఈసీని కోరారు.
దీనిపై మమత ఆధ్వర్యంలోని టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్లో రెండు స్తానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పేరు, గుర్తు అంశం కీలకంగా మారింది. దీంతో దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఇప్పటికిప్పుడు పార్టీ పేరు (టీఎంసీ)ని, గుర్తును ఎవరికీ కేటాయించలేమని ఈసీ తెలిపింది. అందుకే, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ పార్టీ పేరును, గుర్తును రెండు వర్గాల్లో ఎవరూ ఉపయోగించకూడదని ఆదేశించింది. రాబోయే ఉప ఎన్నికల కోసం కొత్త పేరు, గుర్తు కేటాయిస్తామని ఇరు వర్గాలకు తెలిపింది.
శుక్రవారం ఉదయం 11.00 గంటలలోపు మమత వర్గం, రెబల్ వర్గం.. తమ పార్టీ పేర్లు, గుర్తను సూచిస్తూ ఈసీకి తెలపాలని కోరింది. దీంతో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ వర్గం.. తమ పార్టీ పేరు, గుర్తును ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ఈసీకి మెయిల్ ద్వారా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలించనున్న ఈసీ.. మమత వర్గానికి, రెబల్ వర్గానికి వేర్వేరుగా పార్టీల పేర్లు, గుర్తులను కేటాయించనుంది. అయితే, ఈసీ నిర్ణయాన్ని మమతా బెనర్జీ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ గుర్తును తమకు కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
అయితే, ఈ నిర్ణయాన్ని రెబల్ గ్రూప్ సమర్ధించింది. అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇప్పుడు ఈసీ కేటాయించే గుర్తుపైనే మమత వర్గం అయినా.. రెబల్ గ్రూప్ అయినా పోటీ చేయాలి. టీఎంసీ పేరు, పూలు-గడ్డి గుర్తు ఉండదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EC
- Mamata Banerjee
- nandigram
- TMC
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

