Man Kills Daughter | చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన కూతురు.. గొంతునొక్కి చంపిన తండ్రి
Man Kills Daughter | మద్యానికి బానిసైన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురి గొంతునొక్కి చంపాడు. ఈ నేపథ్యంలో భార్య ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
ముంబై: మద్యానికి బానిసైన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురి గొంతునొక్కి చంపాడు. (Man Kills Daughter) ఈ నేపథ్యంలో భార్య ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉద్గిర్ తాలూకాలోని భీమా తండాలో నివసించే బాలాజీ రాథోడ్ మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో భార్య అతడ్ని వదిలి పుట్టింటికి వెళ్లింది. అయితే నాలుగేళ్ల కుమార్తె ఆరుషి అతడి వద్దనే ఉన్నది.
కాగా, ఆదివారం ఆ బాలిక చాక్లెట్ కొనేందుకు తండ్రి బాలాజీ రాథోడ్‌ను డబ్బులు అడిగింది. మద్యం మత్తులో ఉన్న అతడు కుమార్తెపై ఆగ్రహించాడు. చీరతో ఆరుషి గొంతునొక్కి హత్య చేశాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న భార్య వర్ష తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో కుమార్తెను చంపిన అతడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. నిందితుడైన బాలాజీ రాథోడ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: జలపాతంపైన నీటిలో జారిపడిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

