పాట్నా: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చెట్లను తొలగించకుండానే వాటి మధ్యలో రోడ్డును నిర్మించారు. (Road Built With Trees Middle) దీంతో వంద కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మృత్యువును ఆహ్వానించేలా చెట్ల మధ్యలో రోడ్డు నిర్మించిన అధికారులపై జనం మండిపడుతున్నారు. బీహార్లోని జెహానాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జెహానాబాద్లోని పాట్నా-గయా ప్రధాన రహదారిలో 7.48 కిలోమీటర్ల మేర రోడ్డును వంద కోట్ల వ్యయంతో నిర్మించారు.
కాగా, రోడ్డు విస్తరణ కోసం అడ్డుగా ఉన్న చెట్లను అధికారులు తొలగించలేదు. ప్రాజెక్ట్ చేపట్టే ముందు అక్కడి చెట్లను తొలగించేందుకు జిల్లా అధికారులు అటవీశాఖను సంప్రదించారు. అయితే ఆ ప్రాంతంలో తొలగించే చెట్లకు బదులుగా పరిహారం కింద 14 హెక్టార్ల భూమిని అటవీశాఖ డిమాండ్ చేసింది. అధికారులు దానిని నెరవేర్చలేదు. దీంతో రోడ్డు విస్తరణ ప్రాంతంలో చెట్లను తొలగించేందుకు అటవీశాఖ అనుమతించలేదు.
మరోవైపు రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించకుండానే అధికారులు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఆ రహదారి మధ్యలో అక్కడక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిగ్జాగ్ గేమ్ మాదిరిగా వాహనాలను నడపాల్సి వస్తున్నదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృత్యువును ఆహ్వానించేలా ప్రమాదాలకు నిలయంగా వంద కోట్లతో ఈ రోడ్డును నిర్మించిన అధికారులపై జనం మండిపడుతున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
जहानाबाद शहर से 1-2 किमी की दूरी पर इरकी के पास इस तरह से सड़क बनाया गया है,पिछले पांच-छह महीनों में कई एक्सीडेंट हो चुके हैं लेकिन प्रशासन-सरकार किसी को इसकी जानकारी नहीं है,बाहर में जिला का थू-थू करवा रखें हैं ये लोग!@DM_Jehanabad @RCD_Bihar @NitinNabin pic.twitter.com/HSNrqPrVL0
— SOURAV RAJ (@souravreporter2) June 29, 2025
Also Read:
Watch: జలపాతంపైన నీటిలో జారిపడిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: తేజస్వి యాదవ్ మాట్లాడుతుండగా దూసుకొచ్చిన డ్రోన్.. తర్వాత ఏం జరిగిందంటే?