Osmania University : విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునివ్వడంతో ఉస్మానియా యూనివర్సిటీ (OsmaniaUniversity) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 24, శుక్రవారం ఓయూ, అనుబంధ కాలేజీల్లో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షల వాయిదాకు సంబంధించిన సమాచారాన్ని అనుబంధ కళాశాలలకు చేరవేసింది. శుక్రవారం నాటి ఎగ్జామ్స్ గురించి విద్యార్థులు ఆందోళన చెందవద్దని.. వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఓయూ అధికారులు వెల్లడించారు.
విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో జేఎన్టీయూ (JNTU)లో సైతం శుక్రవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని గురువారం జేఎన్టీయూ యాజమ్యాన్యం వెల్లడించింది. అలానే తెలంగాణ యూనివర్సిటీ (TU)లోనూ పరీక్షలను వాయిదా వేశారు. శుక్రవారం జరగాల్సిన పరీక్షలకు త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని అనుబంధ కాలేజీలకు టీయూ అధికారులు సమాచారమిచ్చారు.
Notification Regarding Postponement of all Examinations under Osmania University scheduled on 24th July 2026 @ https://t.co/rCTY7eNjjS pic.twitter.com/LXUT7KUZHh
— Osmania University Updates (@OU_Updates) July 23, 2026