బండ్లగూడ, సెప్టెంబర్ 21 : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ మూసీ నది వెంట ఉన్న రహదారి గుంతలు పూడ్చి సీసీ రోడ్డును వేశారు.ఇంత వరకు బాగానే ఉన్నా.. నాసిరకంతో చేసిన పనులతో ఆ సీసీ రోడ్డు వేసిన వారానికే కుంగిపోయింది.
ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు దగ్గర ఉండి కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేసి చేతులు దులుపుకొంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు.