ఇల్లెందు, మార్చి 06 : మహిళను వేధించిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. కేసు వివరాలు. 2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 24 ఏరియాకు చెందిన ఏర్పుల కృష్ణ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే ఏరియాలో ఉన్న ఓ మహిళను తరచూ వేధింపులకు గురి చేయడంతో ఆ మహిళ ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ వేణు చందర్ కేసు దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సరెండర్ చేశారు. విచారణలో కృష్ణ దోషిగా తేలడంతో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఇల్లెందు జడ్జి డి.చంద్రిక రెడ్డి తీర్పు వెలువరించారు. ఈ కేసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగు అనిల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరపున వాదించగా, సిడిఓ సురేశ్, రాఘవయ్య, హెచ్ సి అనంత రాములు సహకరించారు.