ఇల్లెందు, జూలై 30 : రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని సోషల్ మీడియా వేదికగా సైతం ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు. గురువారం ఇల్లెందు కోర్టుకు హాజరైన ఆమెకు పార్టీ స్థానిక నాయకులు భారీగా తరలివచ్చి మద్దతుగా నిలిచారు. కోర్టులో హాజరు అనంతరం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్‌తో కలిసి పావని గౌడ్ మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, 420 హామీలు అమలు చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రశ్నించినందుకు కేసులు పెట్టడం పనిగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ సైనికులమైన తాము అధికార పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేసేంత వరకు వెంటబడి ప్రశ్నిస్తామని, ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది కీర్తి కార్తిక్, పార్టీ నాయకులు అబ్దుల్ జబ్బర్, సి.సత్యనారాయణ, ఎస్.రంగనాథ్, అబ్దుల్ నబి, ఘాజి, డేరంగుల పోశం, నెమలి ధనలక్ష్మి, కొక్కు సరిత, కాసాని హరి ప్రసాద్, సునీలు, శ్రీకాంత్, మూలగుండ్ల ఉపేందర్, గిన్నారపు రాజేష్, గడ్డి శీను, పాషా, లలిత్ పాసి, రామ్ లాల్ పాసి, ఇమ్రాన్, సన్న రాజేష్, రాసపల్లి రవి, సత్యనారాయణ, ఇమ్రాన్, నెమలి అఖిల్ పాల్గొన్నారు.

పథకాల అమలుకై ప్రభుత్వాన్ని బరాబర్ ప్రశ్నిస్తాం : పావని గౌడ్