Shiva Kandukuri | వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ నటుడు శివ కందుకూరి.!
Shiva Kandukuri | ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు, టాలీవుడ్ యువ నటుడు శివ కందుకూరి త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు, టాలీవుడ్ యువ నటుడు శివ కందుకూరి త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహతో ఆయన వివాహం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. తన కాబోయే జీవిత భాగస్వామి శిశిర సింహతో కలిసి దిగిన ఫొటోలను శివ కందుకూరి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. జీవితంలో మొదలైన ఈ కొత్త, అందమైన ప్రయాణం జీవితాంతం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో, సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లు సమాచారం. డిసెంబర్లో పెళ్లి జరగనుండటంతో కందుకూరి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఈ జంట తమ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2020లో వచ్చిన చూసి చూడంగానే సినిమాతో శివ కందుకూరి హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత గమనం, మను చరిత్ర, భూతద్దం భాస్కర్ నారాయణ, మనమే, అనగనగా వంటి చిత్రాలతో పాటు దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్‌లోనూ నటించి మంచి గుర్తింపు పొందారు. ఇటీవలే ఆయన నటించిన టాల్కమ్ పౌడర్ అనే చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shiva Kandukuri | వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ నటుడు శివ కందుకూరి.!
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

