ముంబై: ఒక స్టూడెంట్ను లేడీ టీచర్ ట్రాప్ చేసింది. (Woman Teacher Rapes Student) అతడికి ఆందోళన తగ్గించే మందులు ఇచ్చి ఏడాదిగా అత్యాచారానికి పాల్పడింది. విద్యార్థి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు అతడ్ని ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. దీంతో పేరెంట్స్ ఫిర్యాదుతో ఆ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ప్రముఖ విద్యా సంస్థలో 40 ఏళ్ల లేడీ టీచర్ ఇంగ్లీష్ బోధిస్తున్నది. వివాహిత అయిన ఆ మహిళకు పిల్లలు కూడా ఉన్నారు.
కాగా, 2023 డిసెంబర్లో స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా డ్యాన్స్ బృందంలో ఉన్న 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల మగ విద్యార్థి పట్ల ఆ ఉపాధ్యాయురాలు ఆకర్షితురాలైంది. 2024 జనవరిలో లైంగిక సంజ్ఞలతో అతడ్ని కవ్వించింది. అయితే తొలుత ఆ విద్యార్థి ఆసక్తి చూపలేదు. ఆ లేడీ టీచర్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో తన ఫ్రెండ్ సహాయాన్ని ఆమె కోరింది. ఆ విద్యార్థితో ఆమె మాట్లాడింది. మధ్యవయసు మహిళలు, టీనేజ్ అబ్బాయిల మధ్య సంబంధాలు చాలా సాధారణమని చెప్పింది. దీంతో లేడీ టీచర్‌ను కలిసేందుకు అతడు అంగీకరించాడు.
మరోవైపు ఆ విద్యార్థిని ఉపాధ్యాయురాలు కారులో ఒకచోటకు తీసుకెళ్లింది. బలవంతంగా అతడి బట్టలు విప్పి లైంగికంగా వేధించింది. కొన్ని రోజులపాటు ఆ యువకుడు ఆందోళన చెందగా యాంటీ యాంగ్జైటీ మాత్రలు ఇచ్చింది. ఆ తర్వాత ఆ స్టూడెంట్ను ముంబైలోని ఫైవ్‌స్టార్ హోటల్స్, ఎయిర్పోర్ట్ సమీపంలోని స్టార్ హోటల్స్‌కు చాలాసార్లు కారులో తీసుకెళ్లింది. అతడికి మద్యం తాగించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది.
కాగా, ఆ విద్యార్థిలో మార్పును అతడి పేరెంట్స్ గమనించారు. అతడ్ని నిలదీయగా లేడీ టీచర్‌తో ఉన్న రిలేషన్ గురించి చెప్పాడు. అయితే తమ కుమారుడి చదువు ప్రభావితం కాకుండా ఉండేందుకు కొంతకాలం వారు మౌనంగా ఉన్నారు. అతడ్ని కట్టడి చేశారు. 12వ తరగతి బోర్డు పరీక్షల తర్వాత ఆ విద్యార్థి ఆ స్కూల్ నుంచి వెళ్లిపోయాడు. అయితే తన పనిమనిషి ద్వారా అతడ్ని ఆ టీచర్ సంప్రదించింది. తనను కలవాలని చెప్పింది.
మరోవైపు ఈ విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంతోపాటు పిల్లల సంరక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత ఆ లేడీ టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉపాధ్యాయురాలికి సహకరించిన ఆమె ఫ్రెండ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: భారీ వర్షాలకు కుంగిన రోడ్డు.. బైక్‌తోపాటు గుంతలో పడిన వ్యక్తి
Watch: జలపాతంపైన నీటిలో జారిపడిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే?