లక్నో: భర్త, పిల్లలకు విషం ఇచ్చి చంపేందుకు భార్య, ఆమె ప్రియుడు ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో భర్తను కత్తితో పొడిచి చంపేందుకు యత్నించారు. తప్పించుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (Woman, Lover Arrested) దీంతో అతడి భార్య, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలైన నైనా శర్మ, గోపాల్ మిశ్రా బహ్జోయ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇద్దరు కుమారులైన నాలుగేళ్ల చిరాగ్, ఏడాదిన్నర కృష్ణ వారికి ఉన్నారు.
కాగా, ప్రియుడు ఆశిష్ మిశ్రాతో నైనాకు వివాహేతర సంబంధం ఉన్నది. దీంతో భర్త, పిల్లల అడ్డు తొలగించుకోవాలని వారిద్దరూ ప్లాన్ వేశారు. జూన్ 30న నైనా పాలలో విషం కలిపి భర్త, ఇద్దరు పిల్లలకు ఇచ్చింది. అయితే ఆ ప్లాన్ ఫలించలేదు. దీంతో జూలై 2న అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రిస్తున్న గోపాల్ మిశ్రాను కత్తితో పొడిచి హత్య చేసేందుకు నైనా, ఆశిష్ ప్రయత్నించారు. తృటిలో తప్పించుకున్న గోపాల్ ఇంటి నుంచి బయటకు పరుగెత్తాడు. గట్టిగా అరిచి చుట్టుపక్కల వారి సహాయం కోరాడు. ఈ నేపథ్యంలో నైనా, ఆమె ప్రియుడు ఆశిష్ మిశ్రా అక్కడి నుంచి పారిపోయారు.
అనంతరం గోపాల్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నైనాకు ఆశిష్ మిశ్రాతో వివాహేతర సంబంధం ఉన్నదని ఆరోపించాడు. వారిద్దరూ కలిసి తనను, తన పిల్లలను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పరారైన నైనా, ఆమె ప్రియుడు ఆశిష్ మిశ్రాను జూలై 4న అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Black Magic | భార్య, అత్తను నగ్నంగా చేతబడి చేయాలని వ్యక్తి బలవంతం.. ఆ ఫొటోలు లీక్