Vijayawada | విజయవాడలో కలకలం.. ఏకంగా పోలీసులపైనే కాల్పులకు యత్నం
Vijayawada | విజయవాడలో ఓ దుండగుడు ఏకంగా పోలీసులపైనే కాల్పులకు యత్నించాడు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Vijayawada | విజయవాడలో ఓ దుండగుడు ఏకంగా పోలీసులపైనే కాల్పులకు యత్నించాడు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో శనివారం ఉదయం ఈగల్ టీమ్‌తో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా.. అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసు అధికారులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి ట్రిగ్గర్ నొక్కినప్పటికీ.. టెక్నికల్ లోపం కారణంగా బుల్లెట్ చాంబర్లోకి రాలేదు. దీంతో అధికారులు తప్పించుకున్నారు.
కాల్పులు విఫలం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని తెలంగాణలోని వరంగల్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడి నుంచి 9ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని విజయవాడ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Firing
- Police
- Vijayawada
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

