ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్(Sara Tendulkar).. తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో ధగధలలాడిపోయింది. ముంబైలో జరిగిన విందు కార్యక్రమానికి.. సారా టెండూల్కర్ అత్యంత ఖరీదైన నెక్లెస్‌లో దర్శనమిచ్చింది. చూడచక్కని బొమ్మలా తయారైన సారా.. ఆ వేడుకకు పింక్ శారీ కట్టుకున్నది. ఇక దానికి తగినట్లు రోజ్ పింక్ బ్లౌజ్తోనూ స్పెషల్‌గా కనిపించింది. టాప్ స్పోర్ట్స్ స్టార్స్, సెలబ్రిటీలు వచ్చిన ఆ విందు వేడుకకు.. సారా చాలా ఖరీదైన నెక్లెస్ ధరించింది. మీనాకారి కళాకృతికి చెందిన ఆభరణంతో ఆమె మెడ మిళమిళ మెరిసిపోయింది.
చీరకట్టులో నిండుగా ఉన్న సారా.. తన మీనాకారి నెక్లెస్‌తో మరింత దివ్యంగా వెలిగిపోయింది. సారా కట్టుకున్న శారీని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఇక ఆ మీనాకారి ఆభరణం మాత్రం సునీతా షేకావత్ కలెక్షన్‌కు చెందినట్లు గుర్తించారు. సెలబ్రిటీ జ్వలరీ నిపుణుడు ప్రియాన్ష్ గోయల్ ప్రకారం సారా టెండూల్కర్ ధరించిన నెక్లెస్ ఖరీదు సుమారు 40 నుంచి 60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. సంప్రదాయకరమైన కుందన్ పోల్కీలు, ఫ్లోరల్ మోటిఫ్‌లతో మెరిసే ఆ నెక్లెస్‌ను తయారు చేసేందుకు కనీసం 360 గంటల సమయంల పట్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
జైపూర్‌కు చెందిన కళాకారులు ఆ నెక్లెస్‌ను తీర్చిదిద్దినట్లు సునీతా షెకావత్ తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. వజ్రాలతో పాటు కొలంబియన్ ఎమరాల్డ్, సౌత్ సీ పెరల్స్‌తో ఆభరణాన్ని రూపొందించినట్లు చెప్పారు.