ముంబై: కేంద్రంతోపాటు మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్దారు.(Raj, Uddhav Thackeray reunion) ‘బెంగాల్, తమిళనాడులో హిందీ అమలుకు ప్రయత్నిస్తారా?’ అని సవాల్ చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం రాష్ట్రంలో హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయగలరా? అని ప్రశ్నించారు. ‘దేవేంద్ర ఫడ్నవీస్, భాషను బలవంతంగా రుద్దడాన్ని సహించబోమని మీరు చెప్పారు. బయట ఇలా చేసే ఒక మరాఠీని నాకు చూపించు’ అని అన్నారు. ఏ భాషకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఏదైనా భాషను బలవంతం చేస్తే మా శక్తిని చూపిస్తామని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు.
కాగా, త్రిభాషా విధానం అమలుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనికి సంబంధించిన ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఈ నేపథ్యంలో శనివారం ముంబైలో ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమం నిర్వహించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము కలిసి ఉండేందుకే కలిసి ఇక్కడకు వచ్చినట్లు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కలిసి సోటీ చేస్తామని తెలిపారు.
మరోవైపు 2005లో విడిపోయిన ఈ ఇద్దరు అన్నదమ్ములు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలుసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల కలయికపై ఇరు పార్టీల నేతల, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Also Read:
Watch: తనను చూసి మొరుగుతున్నదని.. కుక్కపై రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ కాల్పులు