Rahul Picture On Sanitary Pad Packets | శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ఫొటో.. బీహార్‌లో రాజకీయ దుమారం
Rahul Picture On Sanitary Pad Packets | మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై ప్రియాంక గాంధీతోపాటు రాహుల్ గాంధీ ఫొటోలు ఉన్నాయి. దీంతో రాజకీయ దుమారానికి ఇది తెరలేపింది. మహిళల కోసం ఉద్దేశించిన శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ చిత్రం ఎందుకని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నించాయి.
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ గిమ్మిక్కులు మొదలయ్యాయి. (Rahul Picture On Sanitary Pad Packets) ఆ రాష్ట్ర మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో ‘ప్రియదర్శిని ఉడాన్ యోజన’ కింద ఉచిత శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ల పంపిణీని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. బీహార్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మై బహిన్ సమ్మాన్ యోజన’ కింద నెలకు రూ. 2,500 స్టైఫండ్ హామీకి అనుగుణంగా ఈ డ్రైవ్ చేపట్టింది. ఐదు లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్‌లను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
కాగా, మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై ప్రియాంక గాంధీతోపాటు రాహుల్ గాంధీ ఫొటోలు ఉన్నాయి. దీంతో రాజకీయ దుమారానికి ఇది తెరలేపింది. మహిళల కోసం ఉద్దేశించిన శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ చిత్రం ఎందుకని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమైందని సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఇది ఎన్నికల గిమ్మిక్ అని ఆయన అభివర్ణించారు.
మరోవైపు ఎన్డీయే కూటమి పార్టీల విమర్శలను కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా తిప్పికొట్టారు. ‘రాహుల్ గాంధీ ఫొటో ఈ ప్యాకెట్లపై ఎందుకు ఉన్నాయనేది ప్రశ్న కాదు. ఆధునిక యుగంలోనూ బీహార్‌లోని మన కుమార్తెలు ఇప్పటికీ రుతుక్రమంలో వస్త్రం ముక్కలను ఎందుకు ఉపయోగించాల్సి వస్తున్నది. ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారు అనేది ప్రశ్న. బీజేపీ ఎల్లప్పుడూ మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని కలిగి ఉంది’ అని ఆమె విమర్శించారు.
Also Read:
Eknath Shinde | ‘జై గుజరాత్’ అంటూ.. ప్రసంగం ముగించిన ఏక్నాథ్ షిండే
Nipah Virus | కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. మూడు జిల్లాల్లో అలెర్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

