వాషింగ్టన్: భారత సంతతి వైద్యురాలు నాలుగేళ్ల కూతురిని చంపింది. (Mother Killed Daughter) అయితే నీటిలో మునిగి మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం తెలియడంతో ఆ మహిళను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్లహోమాకు చెందిన 36 ఏళ్ల నేహా గుప్తా పిల్లల డాక్టర్. వైద్యుడైన భర్త సౌరభ్ నుంచి ఆమె విడిపోయింది. నాలుగేళ్ల కుమార్తె అరియా ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్నది. ఆ బాలిక కస్టడీ వివాదం కోర్టులో ఉన్నది.
కాగా, జూన్ 27న కుమార్తె అరియాతో కలిసి నేహా గుప్తా ఫ్లోరిడాకు వెళ్లింది. తాత్కాలిక అద్దె ఇంట్లో ఆమె బస చేసింది. అయితే అక్కడి నీటి కొలనులో పడి అరియా మునిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అచేతనంగా ఉన్న ఆ చిన్నారిని హాస్పిటల్‌కు తరలించారు. ఆ బాలిక అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఆ రోజు రాత్రివేళ నిద్రలేచిన కుమార్తె అరియా ఇంటి బయటకు వెళ్లిందని, ప్రమాదవశాత్తు నీటి కొలనులో పడి మునిగి చనిపోయినట్లు నేహా గుప్తా పోలీసులకు తెలిపింది. అయితే ఆ చిన్నారి ఊపిరితిత్తుల్లో లేదా కడుపులో నీరు కనిపించలేదని, గొంతు నొక్కడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నిర్ధారణ అయ్యింది. దీంతో నేహా చెప్పింది అబద్ధమని పోలీసులు తేల్చారు. కుమార్తెను హత్య చేసిందన్న ఆరోపణలపై జూన్ 30న ఆమెను అరెస్ట్ చేశారు. ఫస్ట్ డిగ్రీ హత్యా అభియోగం మోపి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
BrahMos Attack | బ్రహ్మోస్‌పై ప్రతిస్పందించడానికి 30-45 సెకన్లు పట్టింది: పాక్
Watch: స్కూల్‌కు వెళ్లేందుకు.. ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాటుతున్న చిన్నారులు