వాషింగ్టన్: విమానం గాలిలో ఉండగా భారత సంతతి వ్యక్తి తోటి ప్రయాణికుడ్ని కొట్టాడు. (Indian-origin man attacks passenger) అతడు తిరిగి కొట్టడంతో గాయపడ్డాడు. ఆ విమానం ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 21 ఏళ్ల భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ అమెరికాలోని న్యూవార్క్లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉండగా ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు.
కాగా, ఇది గమనించిన ఇషాన్ శర్మ, ఎవాన్స్ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, అతడ్ని చూసిన తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు.
మరోవైపు ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని అతడి తరుఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. కాగా, వీరిద్దరూ కొట్టుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
No more vacation…🫣| #ONLYinDADE
* Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7
— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025
Also Read: