లక్నో: మహిళ, ఆమె కుమారుడ్ని బీజేపీ నేత చెప్పుతో కొట్టాడు. (BJP Leader Assaults Woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బీజేపీ నేత ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 30న డంకౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాస్పూర్ టౌన్లో విద్యుత్ వైర్ విషయంపై ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక బీజేపీ నేత అతీఖ్ పఠాన్ ఈ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. షఫియుర్ రెహమాన్ అనే మహిళ, ఆమె కుమారుడిపై భౌతికంగా దాడి చేశాడు. వారిద్దరిని చెప్పుతో పలుమార్లు కొట్టాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ నేత అతీఖ్ పఠాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మహిళను ఆయన చెప్పుతో కొట్టడంపై ప్రతిపక్షాలతోపాటు నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. అతీఖ్ పఠాన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
महिला और उसके बेटे को चप्पल और डंडे से बुरी तरह मार रहा ये बेशर्म आदमी भाजपा का नेता है।
जो मुख्यमंत्री अपनी पार्टी के नेताओं से महिलाओं की रक्षा नहीं कर पा रहा, सोचिए वो अपराधियों के सामने कितना बेबस होगा?
धिक्कार है!
📍गौतम बुद्ध नगर pic.twitter.com/L42y7zFCCK
— UP Congress (@INCUttarPradesh) July 2, 2025
Also Read:
Watch: రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?