ముంబై: ఒక వ్యక్తి కొరియర్ బాయ్ పేరుతో ఒక ఇంటి వద్దకు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న మహిళపై ఏదో స్ప్రే చేశాడు. స్పృహకోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (fake courier boy rapes woman) ఆ తర్వాత ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, మళ్లీ వస్తానంటూ మెసేజ్ ద్వారా ఆ మహిళను బెదిరించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒక వ్యక్తి కొరియర్ బాయ్ పేరుతో కోంధ్వాలోని ఉన్నతస్థాయి వ్యక్తులు నివసించే హౌసింగ్ సొసైటీలోకి ప్రవేశించాడు. సోదరుడు బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న 22 ఏళ్ల యువతి ఫ్లాట్ వద్దకు వెళ్లి బెల్ నొక్కాడు.
కాగా, డోర్ తీసిన మహిళకు ఆమె బ్యాంకు నుంచి కొరియర్ వచ్చిందని ఆ వ్యక్తి తెలిపాడు. సంతకం చేయాలని చెప్పాడు. ఆమె పెన్ అడగ్గా తన వద్ద లేదన్నాడు. దీంతో పెన్ కోసం ఆ యువతి బెడ్రూమ్లోకి వెళ్లింది. వెంటనే ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి మెయిన్ డోర్ లాక్ చేశాడు. ఆ మహిళపై ఏదో స్ప్రే చేశాడు. స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, మళ్లీ వస్తానంటూ మెసేజ్ ద్వారా బెదిరించాడు.
మరోవైపు బుధవారం రాత్రి 8.30 గంటలకు ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. తన మొబైల్లో ఆ వ్యక్తితో సెల్ఫీ, బెదిరింపు సందేశాన్ని చూసింది. తనపై అత్యాచారం జరిగినట్లు గ్రహించి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఫ్లాట్‌కు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించింది.
కాగా, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడ్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడి అరెస్ట్ కోసం పది పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Family Dies By Suicide | కొడుకును ఆడపిల్లగా ముస్తాబు చేసిన తల్లి.. ఆ తర్వాత ఆ కుటుంబమంతా ఆత్మహత్య
Rs.20 Lakh Worth Car Theft | రూ.20 లక్షల ఖరీదైన కారు నిమిషంలో చోరీ.. వీడియో వైరల్
Watch: రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?