జైపూర్: ఒక తల్లి తన కుమారుడ్ని ఆడపిల్లగా ముస్తాబు చేసింది. తన ఆభరణాలను అలంకరించింది. ఆడపిల్ల మాదిరిగా అందంగా ఉన్న కుమారుడ్ని చూసి మురిసిపోయింది. అంతలోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. (Family Dies By Suicide) రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. జూన్ 1న ఒక మహిళ తన చిన్న కుమారుడికి ఆడపిల్ల డ్రెస్ వేసింది. అతడి కళ్లకు కాటుకపెట్టింది. తన నగలను అలంకరించింది. ఆడపిల్ల మాదిరిగా అందంగా ఉన్న కుమారుడి తలపై ముసుగు కప్పింది. అచ్చం అమ్మాయిగా కనిపించిన అతడ్ని చూసి మురిసిపోయింది. ఆ తర్వాత భార్యాభర్తలు తమ ఇద్దరు కుమారులతో కలిసి ఇంటి సమీపంలోని చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా, మృతుడి సోదరుడు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వెళ్లి చూడాలని పొరుగు వ్యక్తికి చెప్పాడు. దీంతో ఆ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల శివలాల్ మేఘ్వాల్, 32 ఏళ్ల అతడి భార్య కవిత, ఇద్దరు కుమారులైన 9 ఏళ్ల బజరంగ్, 8 ఏళ్ల రామ్‌దేవ్ మృతదేహాలను పోలీసులు వెలికితీశారు.
మరోవైపు శివలాల్ రాసిన సూసైడ్ నోట్‌ను వారి ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ఆత్మహత్యకు తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు కారణమని ఆరోపించాడు. భూమి, ఇంటిని పంచడానికి తల్లి, తమ్ముడు ఏళ్లుగా అభ్యంతరం చెబుతున్నారని, దీంతో రుణంతో సొంత ఇంటిని నిర్మించుకోవాలన్న కోరిక నెరవేరలేదని వాపోయాడు. తమ ఇంటి ముందు అంత్యక్రియలు నిర్వహించాలని అందులో కోరాడు. అయితే మిగతా కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వీరు ఆత్మహత్యలకు పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
bus bursts into flames | మంటల్లో కాలిన బస్సు.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు
Watch: రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Teacher Rapes Student | విద్యార్థిని ట్రాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన లేడీ టీచర్