లక్నో: డీజిల్ లీక్ కారణంగా బస్సుకు మంటలు వ్యాపించాయి. దీంతో అది పూర్తిగా కాలిపోయింది. (bus bursts into flames) అయితే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు సకాలంలో బయటకు దూకారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో సంఘటన జరిగింది. ఒక బస్సు ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్నది. ఉత్తరప్రదేశ్ జాన్పూర్లోని ప్రతాప్గంజ్ మార్కెట్ సమీపంలో అకస్మాత్తుగా ఆ బస్సులో మంటలు చెలరేగాయి.
కాగా, ప్రయాణికులంతా సకాలంలో బస్సు నుంచి కిందకు దూకారు. దీంతో వారంతా తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ బస్సు మంటల్లో కాలిపోయింది. సమీపంలోని ఒక షాపు కూడా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. డీజిల్ ట్యాంక్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. మంటల్లో బస్సు కాలుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Volvo bus turned into a ball of fire in Jaunpur. Somehow dozens of passengers saved their lives by jumping out, UP
pic.twitter.com/rJ9MS5EDJr— Ghar Ke Kalesh (@gharkekalesh) July 2, 2025
Also Read:
Watch: రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
SpiceJet | విమానం గాలిలో ఉండగా ఊడిన విండో ఫ్రేమ్.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Teacher Rapes Student | విద్యార్థిని ట్రాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన లేడీ టీచర్