లక్నో: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లోకి దూసుకెళ్లింది. (Car Rams Into Restaurant) బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. జూన్ 30న రాత్రివేళ జాతీయ రహదారి పక్కన ఉన్న రెస్టారెంట్ కస్టమర్లతో సందడిగా ఉన్నది. ఆహారం తిన్న తర్వాత కొందరు వ్యక్తులు బయటకు వస్తున్నారు. మరికొందరు రెస్టారెంట్ ముందు కూర్చొన్నారు.
కాగా, జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న స్విఫ్ట్ కారు అదుపుతప్పింది. రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న వారి మీదకు అది దూసుకెళ్లింది. దీంతో వారు గాలిలోకి ఎగిరిపడ్డారు. రెస్టారెంట్ గోడను ఢీకొట్టిన తర్వాత ఆ కారు ఆగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
TW: Disturbing video, accident
In UP’s Hapur, a speeding Swift car lost control and ran into people at a resturant. Ajeet Pal, a man who was there at restaurant celebrating his girlfriend’s birthday was killed in the accident. pic.twitter.com/s5eSM9TYw0
— Piyush Rai (@Benarasiyaa) July 1, 2025
Also Read:
Rs.20 Lakh Worth Car Theft | రూ.20 లక్షల ఖరీదైన కారు నిమిషంలో చోరీ.. వీడియో వైరల్
SpiceJet | విమానం గాలిలో ఉండగా ఊడిన విండో ఫ్రేమ్.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Teacher Rapes Student | విద్యార్థిని ట్రాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన లేడీ టీచర్