ముంబై: విమానం గాలిలో ఎగురుతుండగా విండో ఫ్రేమ్ ఊడిపోయింది. ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. జూలై 1న స్పైస్‌జెట్ (SpiceJet) విమానం గోవా నుంచి పూణే ప్రయాణించింది. అయితే ఆ విమానం గాలిలో ఉండగా విండో ఫ్రేమ్ ఊడిపోయింది. ఆ విమానంలోని ప్రయాణికులు ఇది చూసి భయాందోళన చెందారు. ఆ విమానం భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్లేన్ సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, క్యూ400 విమానం ఎగురుతున్నప్పుడు వదులుగా ఉన్న నీడ రాకుండా ఏర్పాటు చేసిన విండో ఫ్రేమ్ ఊడిపోయిందని స్పైస్‌జెట్ తెలిపింది. ఆ విమానంలో క్యాబిన్ ప్రెజరైజేషన్ సాధారణంగానే ఉన్నట్లు చెప్పింది. ప్రయాణికుల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొంది. విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాంగ్ కాగానే దానిని సరిచేసినట్లు వివరించింది. విమానంతోపాటు ప్రయాణికుల భద్రతలో ఎలాంటి రాజీ లేదని వెల్లడించింది.
మరోవైపు ఒక ప్రయాణికుడు ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ విమానం భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వీడియో క్లిప్‌ను డీజీసీఏకు ట్యాగ్ చేశాడు.
Window frame dislodges mid-air on Pune to Goa SpiceJet flight SG1080 on July 1, causing a scare amongst passengers. No cabin depressurisation, airline says only inner frame dislodged. Video by passenger Mandar Sawant.
Story by @SohamShah07, link in thread. pic.twitter.com/XBdAmuKXEn
— Express Pune Resident Editor (@ExpressPune) July 2, 2025
Also Read:
Rs.20 Lakh Worth Car Theft | రూ.20 లక్షల ఖరీదైన కారు నిమిషంలో చోరీ.. వీడియో వైరల్
Woman Teacher Rapes Student | విద్యార్థిని ట్రాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన లేడీ టీచర్