KTR | మహిళలను తల్లి, చెల్లె, కుమార్తె అనే భావంతో మాత్రమే కాకుండా.. వారిని కూడా మనుషులుగా గుర్తించి గౌరవించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. కీలక సందేశమిచ్చారు.
మహిళలు కూడా మనలాగే మనుషులు, వారికి మనలా సమాన హక్కులు ఉండాలని, వారిని కూడా గౌరవించాలని అంగీకరించిన రోజున ప్రపంచం మరింత మంచి స్థలంగా మారుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మహిళలు తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి నుంచి బయటపడేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మంచి మనుషులుగా మారాలని, మహిళలకు గౌరవం ఇవ్వాలని సంకల్పించుకోవాలని పిలుపునిచ్చారు. బలమైన మహిళలు సమాజంలో మరింత ఎదిగి, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.