న్యూఢిల్లీ: సుమారు రూ.20 లక్షల ఖరీదైన కారును దొంగలు నిమిషంలో చోరీ చేశారు. (Rs.20 Lakh Worth Car Theft) ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాన్ని పగులగొట్టారు. ఆ తర్వాత దాని సెక్యూరిటీ వ్యవస్థను హ్యాక్ చేశారు. 60 క్షణాల్లో ఆ కారుతో ఉటాయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో నివసించే రిషబ్ చౌహాన్ రాత్రి వేళ ఇంటి బయట హ్యుందాయ్ క్రెటా కారును పార్క్ చేశాడు.
కాగా, జూన్ 21న తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఒక కారులో అక్కడకు వచ్చారు. ఆ కారు నుంచి దిగిన మాస్క్ ధరించిన ఒక వ్యక్తి ఇంటి బయట పార్క్ చేసిన హ్యుందాయ్ క్రెటా వద్దకు వెళ్లాడు. స్క్రూడ్రైవర్ లాంటి వస్తువుతో డ్రైవర్ సీటు వైపు ఉండే అద్దాన్ని పగులగొట్టాడు. వెనక్కి వెళ్లిన ఆ కారు మళ్లీ అక్కడకు వచ్చింది. మాస్క్ ధరించిన మరో వ్యక్తి ఆ కారులోని భద్రతా వ్యవస్థను హ్యాక్ చేశాడు. ఆ తర్వాత తొలి వ్యక్తి హ్యుందాయ్ క్రెటాను డ్రైవ్ చేసుకుని వెళ్లిపోయాడు.
మరోవైపు సుమారు రూ.20 లక్షల విలువైన హ్యుందాయ్ క్రెటా మాయం కావడం చూసి దాని యజమాని రిషబ్ చౌహాన్ షాక్ అయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఆ కారు సెక్యూరిటీ లాక్ సిస్టమ్‌ను హ్యాక్ చేసిన దొంగలు కేవలం 60 క్షణాల్లో దానిని ఎత్తుకెళ్లినట్లు తెలుసుకున్నాడు. కారు చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. రూ.20 లక్షల కారును కేవలం నిమిషంలో దొంగలు చోరీ చేసిన తీరు చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ కారు సెక్యూరిటీ లాకింగ్ సిస్టమ్‌పై పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
Also Read:
Woman Teacher Rapes Student | విద్యార్థిని ట్రాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన లేడీ టీచర్
7 Rapes In 17 Days | 17 రోజుల్లో ఏడు అత్యాచారాలు.. మేకలు మేపుతున్న మహిళపై సామూహిక లైంగిక దాడి