Tehran Airport: టెహ్రాన్ విమానాశ్రయంలో భారీ పేలుళ్లు.. 7 రోజుల్లో ఇరాన్లో 1300 మంది మృతి
Tehran Airport : టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో విమానాలు దగ్ధం అయ్యాయి. భారీ ఎత్తున ఆ విమానాశ్రయం నుంచి మంటలు వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. మరో వైపు ఇరాన్లో గత ఏడు రోజుల్లో దాడుల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 1300 దాటంది.
జెరుసలాం : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడులు ఏడో రోజుకు చేరుకున్నాయి. తాజాగా టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం(Tehran Airport)పై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో విమానాలు దగ్ధం అయ్యాయి. భారీ ఎత్తున ఆ విమానాశ్రయం నుంచి నల్ల పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్లో అత్యంతి బిజీ ఎయిర్‌పోర్టు అది. వైమానిక బాంబు దాడులు జరిగిన సమయంలో ఆ విమానాశ్రయంలో చాలా వరకు విమానాలు పార్క్ చేసి ఉన్నట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా తెలిసింది. ఎయిర్‌పోర్టులోని కొన్ని భాగాలు ధ్వంసమైనట్లు ఇరాన్ మీడియా పేర్కొన్నది. చాలా విస్తృత స్థాయిలో దాడులు చేయనున్నట్లు శుక్రవారం ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. మార్చి 4వ తేదీన కూడా ఇదే విమానాశ్రయాన్ని టార్గెట్ చేశారు. ఆ దాడి వల్ల అక్కడ ఉన్న డిఫెన్స్, డిటెక్షన్ సిస్టమ్స్ ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పేర్కొన్నది. తాజా సమాచారం ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు సుమారు 1332 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
JUST IN: The moment 🇮🇷 Iran’s Mehrabad International Airport hit by massive US-Israeli airstrikes.
🚩More details.. Follow #Iran #IranWar2026 #TelAviv #füze #IranIsraelWar #IsraelIranWar pic.twitter.com/iKXhgVDs5z
— 𝐑ated 𝖎nsights 🎖 (@RatedInsights) March 7, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

