AN/TPY-2 Radar: కీలకమైన అమెరికా రేడార్‌ను పేల్చేసిన ఇరాన్
AN/TPY-2 Radar: థాడ్ మిస్సైల్ బ్యాటరీలకు చెందిన ఏఎన్/టీపీవై-2 ట్రాన్స్‌పోర్టబుల్ రేడార్‌ను ఇరాన్ పేల్చేసింది. జోర్డాన్‌లో ఉన్న ఈ రేడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసినట్లు మీడియా పేర్కొన్నది. క్షిపణులు, డ్రోన్ల రాకను పసికట్టడంలో ఈ రేడార్ కీలకంగా వ్యవహరిస్తుంది.
దుబాయ్: అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు ధీటుగా ఇరాన్ బదులిస్తున్నది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతున్నది. అయితే వార్ మొదలైన తొలి రోజుల్లోనే అమెరికాకు చెందిన కీలక రేడార్‌ను ఇరాన్ పేల్చివేసింది. జోర్డాన్‌లోని మువాఫక్ సల్టీ ఎయిర్‌బేస్ వద్ద ఉన్న ఏఎన్-టీపీవై-2 రేడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసినట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా నిర్ధారించారు. ఏఎన్-టీపీవై-2 రేడార్‌ను థాడ్ క్షిపణి బ్యాటరీగా వాడుతారు. శత్ర దేశ క్షిపణులు, డ్రోన్ల రాకలను ఈ రేడార్ పసికట్టి .. మిస్సైల్ వ్యవస్థకు సమాచారం ఇస్తుంది. అయితే జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో ఉన్న అమెరికా మిస్సైల్ ఇంటర్సెప్టార్ రేడార్ కేంద్రాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ వద్ద ఉన్న రేడార్ వ్యవస్తను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు యూఏఈలోని సదర్, రువాయిస్‌లో ఉన్న అమెరికా రేడార్లు కూడా ధ్వంసమైనట్లు శాటిలైట్ పిక్స్ ద్వారా భావిస్తున్నారు.
మిస్సైల్ దాడులను పసికట్టడంలో రేడార్లు కీలకంగా వ్యవహరిస్తాయి. టార్గెట్ దిశగా వస్తున్న బాలిస్టిక్ క్షిపణులను రేడార్లు పసికట్టడం వల్లే యాంటీ మిస్సైల్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న థాడ్ మిస్సైల్ వ్యవస్థకు చెందిన 8 బ్యాటరీలు ఆపరేషన్‌లో ఉన్నాయి. రెండు యూఏఈ దగ్గర, ఒకటి సౌదీ అరేబియా వద్ద ఉన్నాయి. ఇక ఇరాన్‌కు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోర్డాన్‌లోని సాల్టి ఎయిర్‌బేస్‌లో కూడా ఓ థాడ్ బ్యాటరీ ఉన్నది. థాడ్ రేడార్ సిస్టమ్‌ను ఏఎన్-టీపీవై-2గా పిలుస్తారు. ఇది ట్రాన్స్‌పోర్టబుల్ రేడార్. రేథియాన్ కంపెనీ దీన్ని ఉత్పత్తి చేస్తున్నది. సుమారు 50 కోట్ల బిలియన్ల ఖరీదైన రేడార్ వ్యవస్థ అమెరికా వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
🇮🇷🇮🇱🇺🇸⚡️– The US AN/TPY-2 radar that was destroyed by Iran in recent days at the Muwaffaq Salti Air Base in Jordan. pic.twitter.com/qgZSrN4uS3
— Warfront (@warfront_x) March 7, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

