LPG Cylinder | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.
ఇప్పటివరకు గృహ వినియోగ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.853 ఉండగా.. అది రూ.913కి చేరింది. ఇక హైదరాబాద్‌లో గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965కి పెరిగింది. ముంబైలో రూ.879 నుంచి రూ.930కి చేరింది. ఇక చెన్నైలో రూ.868 .50 నుంచి రూ.928.50కి పెరిగింది. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లోనూ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.