బెంగళూరు: ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తాజాగా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. బెంగళూరులోని సీవోఈలో నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో బుమ్రా పాసయ్యాడని, ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరుగబోయే రెండు మ్యాచ్ల సిరీస్ కోసం అతడు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్స్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్లో భారత్ ఫైనల్ చేరాలంటే తర్వాత ఆడబోయే 9 టెస్టుల్లో ఏడు నెగ్గాల్సిన నేపథ్యంలో లంక సిరీస్కు బుమ్రాను ఆడించనున్నారు.