హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధికరించిన ప్రభుత్వ అధికారులు ఎంతటి ఉన్నతస్థాయిల్లో ఉన్నా, చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నతాధికారులు సైతం కోర్టు ఉత్తర్వులకు అతీతులు కాదని స్పష్టంచేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పాలన (రూల్ ఆఫ్ లా) కొనసాగాలే తప్ప, వ్యక్తి పాలన (రూల్ ఆఫ్ మెన్) కాదని స్పష్టంచేసింది. అలాకాకుండా వ్యక్తిపాలన రాజ్యమేలితే, అది ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని అభిప్రాయపడింది. వ్యక్తుల ఇష్టారాజ్య పాలనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఉన్న కేసులే నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో అలాంటి ప్రయత్నాలు ఎన్నటికీ విజయవంతం కావని స్పష్టంచేసింది. సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంట గ్రామం సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ఈ నెల 27వ తేదీన సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై బదిలీ వేటు వేయాలని సూచించారు. ఈ 56 పేజీల తీర్పు కాపీ శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా కోర్టు తీర్పులు చట్టపరమైన అంశాలతో ప్రారంభమవుతాయి. కానీ, ఈ కేసులో మాత్రం జస్టిస్ అనిల్‌కుమార్ గ్రీకు పురాణాల్లోని ‘హైడ్రా’ అనే జలరాక్షసిని ప్రస్తావిస్తూ తీర్పును ప్రారంభించారు. అనేక శిరస్సులు ఉన్న హైడ్రా అనే రాక్షస సర్పం తనను ఎవరూ ఓడించలేరని భావించేదని, ఒక తలను నరికితే మరిన్ని తలలు మొలిచేవని గ్రీకు పురాణాల్లో ఉన్నదని పేర్కొన్నారు. అయినా చివరికి హైడ్రా సర్పం కూడా ఓడిపోయిందని తెలిపారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న హైడ్రా సంస్థ కూడా తాము చట్టానికి అతీతమనే భావనలో ఉండకూడదని సూచించారు. ప్రభుత్వ సంస్థలకు చట్టం కంటే ఎకువ అధికారం ఉండదని, రాజ్యాంగం, కోర్టుల ఆదేశాలు, చట్టాల పరిధిలోనే ప్రతి అధికారి పనిచేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. చట్టపాలనను పకనబెట్టి అధికార దర్పంతో వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. న్యాయపాలనను పరిరక్షించాలంటే హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి ఏవీ రంగనాథ్‌ను రిలీవ్ చేయడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. రంగనాథ్ స్థానంలో తగిన అధికారిని వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.
సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంట గ్రామం, సర్వేనంబర్లు 1, 2లో సుమారు 40 ఎకరాల భూమిపై యాజమాన్య హకుల విషయంలో గత పదేండ్లుగా వివిధ కోర్టుల్లో వివాదం కొనసాగుతున్నది. సివిల్ కోర్టులు, హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్.. వరుసగా పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పులు ఇచ్చారు. ప్రభుత్వం దాఖలు చేసిన దావాను డిస్మిస్ చేశారు. అప్పీల్ చేయలేదు కాబట్టి.. ఆ భూమిపై తమకు హకులు ఉన్నాయని పిటిషనర్ వాదన. ఆ భూమిలో ప్రభుత్వ శాఖలు లేదా హైడ్రా జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కలెక్టర్‌కు, హైడ్రా కమిషనర్‌కు నోటీసులు జారీచేయగా, కూల్చివేతలు చేపట్టబోమని హైకోర్టుకు హైడ్రా హామీ ఇచ్చింది. కానీ రెవెన్యూ, హైడ్రా అధికారులు తరచూ తమ భూమిలోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.
మొదటి ధికరణ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు అధికారులు హాజరై.. ఇకపై కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేస్తామని, పిటిషనర్ హకులకు భంగం కలిగించబోమని హామీ ఇచ్చారు. దీంతో హైకోర్టు ఆ కేసును ముగించింది. తర్వాత కూడా వివాదం కొనసాగడంతో మరోసారి హైడ్రా కమిషనర్‌పై ధికరణ కేసు దాఖలైంది. ఈ రెండో కేసు విచారణలో హైడ్రా కమిషనర్ సూచనల మేరకు సంస్థ తరఫు న్యాయవాది హాజరై ‘ఇకపై హైడ్రా అధికారులు పిటిషనర్ భూమిలోకి ప్రవేశించరు’ అని అత్యంత స్పష్టంగా కోర్టుకు హామీ ఇచ్చారు. హైడ్రా హామీని నమోదు చేసిన హైకోర్టు.. పిటిషనర్ ఆస్తిలోకి హైడ్రా వెళ్లరాదని చెప్పి కోర్టు ధికరణ కేసు విచారణను ముగించింది. ఆ తర్వాతే అసలు మలుపు తిరిగింది. హైడ్రా కమిషనర్ స్వయంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించి పిటిషనర్ భూమిలోకి వెళ్లినట్టు కోర్టు గుర్తించింది.

హైకోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చిన కొద్దిరోజులకే హైడ్రా అధికారులు దానిని ఉల్లంఘించడమే ఈ ధికరణ కేసులో అత్యంత తీవ్రమైన అంశమని ధర్మాసనం పేరొన్నది. కోర్టుకిచ్చిన హామీ కేవలం ఒక ప్రకటన కాదని, అది న్యాయస్థానానికి ఇచ్చిన అధికారిక బాధ్యత అని, దానిని ఉల్లంఘించడం కోర్టు అధికారాన్నే సవాల్ చేయడమని తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు రికార్డుల ప్రకారం.. గత ధికరణ కేసు విచారణ సందర్భంగా హైడ్రా తరఫు న్యాయవాది, కమిషనర్ సూచనల మేరకు ఇకపై పిటిషనర్ భూమిలోకి హైడ్రా అధికారులు ప్రవేశించరని, ఎలాంటి జోక్యం చేసుకోరని స్పష్టంగా హామీ ఇచ్చారని గుర్తుచేసింది. ఆ హామీని విశ్వసించిన కోర్టు కేసును ముగించింది. అయితే అదే హామీని అధికారులు కొద్దిరోజుల్లోనే తుంగలో తొకారని తీర్పులో పేరొన్నది.
2026 జూలై 17, 18 తేదీల్లో హైడ్రా అధికారులు పెద్ద సంఖ్యలో సిబ్బంది, జేసీబీలు, భారీ యంత్రాలు, పోలీస్ బలగాలతో కలిసి పిటిషనర్‌కు చెందిన భూమిలోకి ప్రవేశించినట్టు కోర్టు నమోదుచేసింది. అకడ ఏర్పాటుచేసిన తాతాలిక నిర్మాణాలను తొలగించారని, ఆస్తిలోకి వెళ్లి చర్యలు చేపట్టారని పేరొన్నది. రెవెన్యూ శాఖ అభ్యర్థన మేరకే భూమిలోకి వెళ్లామని హైడ్రా పేర్కొనగా, ఈ వాదనను కోర్టు పూర్తిగా తిరసరించింది. రెవెన్యూ అధికారులు ఇచ్చిన రికార్డులను బట్టి ఆ ప్రైవేట్ భూమిలోకి హైడ్రాను వెళ్లాలని తహసీల్దార్ లేదా జిల్లా కలెక్టర్ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. దీంతో ఈ కారణం వాస్తవాలకు విరుద్ధమని స్పష్టంచేశారు. భూమి సరిహద్దుల నిర్ధారణ పూర్తికాకముందే, యాజమానికి నోటీసు ఇవ్వకుండానే అధికారులు చర్యలు చేపట్టడం తీవ్రమైన అంశమని పేర్కొన్నది. ఈ కేసులో అధికారులు చేసిన తప్పును సాధారణ పరిపాలన పొరపాటుగా చూడలేమని స్పష్టంచేసింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తెలిసినా, కోర్టుకు ఇచ్చిన హామీ గుర్తున్నా, అదే భూమిలోకి వెళ్లి చర్యలు చేపట్టడం పూర్తిగా ఉద్దేశపూర్వక చర్యగానే భావిస్తున్నామని ప్రకటించింది. ప్రభుత్వ అధికారులకు చట్టబద్ధ అధికారాలు ఉన్నప్పటికీ, కోర్టు ఉత్తర్వులకు లోబడి ఆ అధికారాల వినియోగం ఉండాలని గుర్తుచేసింది.
‘రూల్ ఆఫ్ లా’ కాకుండా ‘రూల్ ఆఫ్ మెన్’ పాలన కొనసాగించాలని అనుకోవడం ప్రజాస్వామ్యంలో ఒక భ్రమ. అది ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోతుంది. పాలనలో వ్యక్తుల ఇష్టారాజ్యం కొనసాగితే, ప్రజాస్వామ్యానికి మరణ మృదంగం మోగించినట్టే అవుతుంది. ఈ కేసులో చట్ట పాలనపై వ్యక్తుల ఇష్టారాజ్య పాలన పైచేయి సాధించే ప్రయత్నం కనిపించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇష్టారాజ్యంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి, కోర్టుకిచ్చిన హామీలను ధికరించి చేసిన చర్యలే ఇందుకు నిదర్శనం. కానీ నిజమైన ప్రజాస్వామ్యంలో అలాంటి ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కాబోవు. ఉన్నత పదవుల్లోని అధికారులు సైతం కోర్టు ఉత్తర్వులకు అతీతం కాదు.
హైడ్రా కమిషనర్ చర్యలు కేవలం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన మాత్రమే కాకుండా, న్యాయపాలనకే సవాల్‌గా మారాయి. ఈ తరహా ధోరణి కొనసాగితే ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది. కోర్టు ధికరణ చట్టం ఉద్దేశం క్షమాపణలు స్వీకరించడం కాదు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటం.
హైడ్రా కమిషనర్‌పై ఇప్పటికే 62 ధికరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు ఉత్తర్వుల పట్ల ఒక ప్రభుత్వ అధికారి ఎలాంటి వైఖరితో వ్యవహరిస్తున్నారో ఇది చూపుతున్నది. ఇలాంటి వ్యక్తులపై మళ్లీ సానుభూతి చూపిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. హైడ్రా చర్యలు కేవలం ఒక భూమి వివాదానికే పరిమితం కాలేదు. కోర్టుల అధికారాన్ని సవాల్ చేసే ధోరణికి దారితీస్తున్నాయి. న్యాయవ్యవస్థను బలహీనపరిచే ఇలాంటి చర్యల విషయంలో ఎలాంటి ఉదారత చూపలేం.
‘రూల్ ఆఫ్ లా’కు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేవలం క్షమాపణలతో తప్పించుకోలేరని స్పష్టం చేసింది. కోర్టు ధికరణ వ్యవహారాల్లో శిక్ష విధించడం ప్రతీకారం కోసం కాదని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని, చట్టపాలనను కాపాడటానికేనని సుప్రీంకోర్టు గతంలో పలుమార్లు స్పష్టం చేసిందని పేర్కొన్నది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోతే అది మొత్తం న్యాయవ్యవస్థను అవమానించినట్టేనని తెలిపింది. చట్టం ముందు ఎంత ఉన్నతస్థాయి అధికారి అయినా సమానమేనని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే హకు ఎవరికీ లేదని చెప్పింది. అవసరమైతే శిక్షతోపాటు ఉద్యోగహోదా స్థాయిని కూడా తగ్గించే అధికారం కోర్టులకు ఉన్నదని సుప్రీంకోర్టు పేర్కొన్నదని గుర్తుచేసింది. ప్రజాస్వామ్యం నిలబడేది రాజ్యాంగం, చట్టం, న్యాయస్థానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసంపైనే అని, ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను సహించే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది.
హైడ్రా కమిషనర్ వ్యవహారశైలిపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. రిజిస్ట్రీ అందించిన సమాచారం ప్రకారం.. కమిషనర్‌పై ఇప్పటికే 62 ధికరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నది. కోర్టు ఉత్తర్వులపై ఒక ప్రభుత్వ అధికారి ఎలాంటి వైఖరితో వ్యవహరిస్తున్నారో ఇది చూపుతున్నదని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యక్తులపై మళ్లీ సానుభూతి చూపిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించింది. హైడ్రా చర్యలు కేవలం ఒక భూమి వివాదానికే పరిమితం కాలేదని, కోర్టుల అధికారాన్ని సవాల్ చేసే ధోరణికి దారితీస్తున్నాయని పేరొన్నది. న్యాయవ్యవస్థను బలహీనపరిచే ఇలాంటి చర్యల విషయంలో ఎలాంటి ఉదారత చూపలేమని స్పష్టంచేసింది. రెండో అఫిడవిట్లో క్షమాపణ కోరడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘శిక్ష తప్పదని అర్థమైన తర్వాత చెప్పే క్షమాపణను నిజమైన పశ్చాత్తాపంగా పరిగణించలేము. కోర్టు ధికరణ కేసుల్లో క్షమాపణ అనేది హృదయపూర్వకంగా, ప్రారంభ దశలో వ్యక్తంచేయాలి.
చివరి దశలో శిక్ష నుంచి తప్పించుకొనేందుకు చెప్పే క్షమాపణకు చట్టంలో విలువ ఉండదు’ అని తీర్పులో పేర్కొన్నది. కోర్టు ఉత్తర్వులను అధికారులు తమకు అనుకూలంగా అర్థం చేసుకొని, అమలు చేయడం లేదా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం అని వెల్లడించింది. కోర్టుల ఆదేశాలను అమలు చేయాలా వద్దా? అని నిర్ణయించే అజమాయిషీ ఏ అధికారికీ లేదని పేర్కొన్నది. ‘ఈ తరహా ధోరణి కొనసాగితే ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది. హైడ్రా కమిషనర్ చర్యలు కేవలం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన మాత్రమే కాకుండా, న్యాయపాలనకే సవాల్‌గా మారాయి. కోర్టు ధికరణ చట్టం ఉద్దేశం క్షమాపణలు స్వీకరించడం కాదు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటం’ అని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పాలన (రూల్ ఆఫ్ లా) బలపడాలని, వ్యక్తిపాలన (రూల్ ఆఫ్ మెన్) కాదని పేర్కొన్నది. వ్యక్తుల పాలన ప్రబలితే ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని హెచ్చరించింది. చట్టపాలనపై వ్యక్తుల పాలన పైచేయి సాధించేందుకు చేసిన ప్రయత్నానికి ఈ కేసు ఒక నిదర్శనమని పేర్కొన్నది. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఒక భ్రమ, కలగానే మిగిలిపోతాయని పేర్కొన్నది.
ఈ కేసులోని మొత్తం పరిస్థితులు, కోర్టు ఆదేశాల ఉల్లంఘన, కోర్టుకిచ్చిన హామీని తుంగలో తొక్కడం, తిరిగి అదే భూమిలోకి హైడ్రా యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం వంటివి పరిశీలించిన తర్వాత.. న్యాయపాలన ప్రయోజనాల దృష్ట్యా కమిషనర్ రంగనాథ్‌ను ఆ బాధ్యతల్లో కొనసాగించడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. ‘రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేయడం అవసరం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయంగా తగిన అధికారిని నియమించాలి’ అని సూచించారు. చట్టపాలనను పరిరక్షించేందుకు, కోర్టుల గౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ తీర్పు ఆవశ్యకం అని చెప్పారు.