Manne Krishank | బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ఇంటివద్ద(Manne Krishank house) కార్ఖాన సీఐ అనురాధ(CI Anuradha overreacts) మరోసారి హంగామ సృష్టించారు. క్రిషాంక్ ఇంట్లో లేకపోయినా తన ఏడేళ్ల కూతురు పరీక్షల కోసం వెళ్తుండగా అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా క్రిషాంక్ బంధువుల సెల్ ఫోన్‌ను సీఐ అనురాధ లాక్కున్నారు. సీఐ దురుసు ప్రవర్తనపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కాగా, మొన్న కూడా సదరు సీఐ ఇలాంటి దుశ్చర్యకే పాల్పడింది. లోపలేస్తా నా కొడుకా..! తమాషా చేస్తున్నారా..? అంటూ ఓ మహిళా ఇన్స్పెక్టర్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇంటి వద్ద పోలీసు జులం పరిమితులు దాటి హల్చల్ సృష్టించారు. సీఐ మాట్లాడిన వ్యవహార శైలికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
మంగళవారం బీఆర్ఎస్ నేత క్రిశాంక్ నివాసం వద్దకు కార్ఖానా సీఐ అనురాధ తమ బృందంతో వెళ్లారు. క్రిశాంక్ భార్య ఆయన ఇంట్లో లేడని ఎంత చెప్పినా.. వినకుండా గట్టిగా అరుస్తూ సీఐ ఆవేశంతో రగిలిపోయారు. ఇంట్లో చిన్న పాప ఉందనే విషయాన్ని చెబుతున్నా వినకుండా తలుపులు నెట్టుకుంటూ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. వచ్చిరాగానే ఇంటి బయట పనిచేసుకుంటున్న పనివాళ్లను ఉద్దేశిస్తూ ఏమి రా.. లోపలేస్తా నాకొడుకా… తమషాలు చేస్తున్నారా..? తలుపులు తీయండంటూ తీవ్రంగా హెచ్చరించారు. మీ అరుపులకు పసిపాప భయపడుతుందని కుటుంబ సభ్యులు కోరుతున్నా మహిళా సీఐ మాత్రం తన నోరు పారేసుకుంటున్న వీడియో దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అయితే బయట నుంచి వచ్చిన క్రిశాంక్‌ను పోలీసులు బలవంతంగా లాక్కిళ్లి వాహనంలో ఈడ్చి పారేశారు.
మన్నె క్రిషాంక్ ఇంటివద్ద మరోసారి కార్ఖాన సీఐ అనురాధ హంగామా
క్రిషాంక్ ఇంట్లో లేకపోయినా తన ఏడేళ్ల కూతురు పరీక్షల కోసం వెళ్తుండగా అడ్డుకుని, బంధువుల ఫోన్ లాక్కున్న అనురాధ https://t.co/wLYZ0qk8i7 pic.twitter.com/y9q8vEM5mi
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026