హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ తెలుగు క్రీడాకారుల కోసం ఎంపిక ట్రయల్స్ నిర్వహించనుంది. రెండు తెలుగు రాష్ర్టాల క్రీడాకారులకు పీవీఎల్‌లో ఆడే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ టాలెంట్ హంట్ చేపడుతున్నట్లు జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు. ఈనెల 6న విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఇండోర్ స్టేడియంలో అండర్-21 విభాగంతో పాటు పీవీఎల్ ప్రధాన జట్టు కోసం ఓపెన్ ట్రయల్స్ జరుగుతాయన్నారు.ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ప్రైమ్‌వాలీబాల్ లీగ్ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని వివరాలకు, 99129 97787 నంబరులో సంప్రదించాలని తెలిపారు.