పాట్నా: ఆటో నడిపే వ్యక్తిని ఒక పోలీస్ అధికారి చితకబాదాడు. అతడి కులం అడిగి తెలుసుకుని మరింత రెచ్చిపోయాడు. నేలపై ఉమ్మి దానిని నాకాలని బలవంతం చేశాడు. (Cop Asks Caste, Forces Man Lick Spit) ఈ సంఘటన నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 1న ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్ ప్రదుమాన్ కుమార్ ప్రయాణికులను మెహుస్ గ్రామంలో దించాడు. జంక్షన్ వద్ద సివిల్ డ్రెస్‌లో బైక్‌పై వచ్చిన మెహుస్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ప్రవీణ్ చంద్ర దివాకర్ ఆ ఆటో డ్రైవర్‌ను అడ్డుకుని తిట్టాడు. వాగ్వాదం నేపథ్యంలో సుమారు 50 సార్లు లాఠీతో అతడ్ని కొట్టాడు.
కాగా, ఆటో డ్రైవర్ ప్రదుమాన్ కుమార్ మద్యం మత్తులో ఉన్నాడని, అమ్మాయిలను వేధించాడని పోలీస్ అధికారి ప్రవీణ్ చంద్ర దివాకర్ ఆరోపించాడు. పోలీస్ వాహనాన్ని రప్పించి అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆటో డ్రైవర్‌ను తిట్టడంతోపాటు మళ్లీ కొట్టాడు. ఏ కులం అని అడగ్గా బ్రాహ్మణుడిగా ప్రదుమాన్ కుమార్ చెప్పాడు. దీంతో ‘బ్రాహ్మణ కులానికి చెందిన వారిని చూడటం నాకు ఇష్టం లేదు’ అని ఆ పోలీస్ అధికారి అన్నాడు. నేలపై ఉమ్ము వేసి ఆటో డ్రైవర్‌తో బలవంతంగా నాకించాడు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ ప్రదుమాన్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ కుమార్‌కు ఈ విషయం చెప్పాడు. దీంతో ఈ సంఘటనపై విచారణ జరుపాలని, ఆ పోలీసు అధికారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆ ఎమ్మెల్యేతోపాటు స్థానికులు డిమాండ్ చేశారు.
కాగా, ఈ సంఘటన రాజకీయ దుమారానికి తెరలేచింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారి ప్రవీణ్ చంద్ర దివాకర్‌పై దర్యాప్తు జరిపి ఆయనను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆ పోలీస్ అధికారి ఖండించారు. అవి రాధారమని అన్నారు.
Also Read:
Woman Teacher Rapes Student | విద్యార్థిని ట్రాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన లేడీ టీచర్
7 Rapes In 17 Days | 17 రోజుల్లో ఏడు అత్యాచారాలు.. మేకలు మేపుతున్న మహిళపై సామూహిక లైంగిక దాడి
Watch: భారీ వర్షాలకు కుంగిన రోడ్డు.. బైక్‌తోపాటు గుంతలో పడిన వ్యక్తి