Sekhar Kammula | ‘హ్యాపీ డేస్ 2’కు రంగం సిద్ధం అవుతుందా? .. శేఖర్ కమ్ముల నుంచి మరో యూత్ సెన్సేషన్!
Sekhar Kammula | టాలీవుడ్లో సెన్సిబుల్ కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’తో ప్రారంభమైన ఆయన ప్రయాణం తాజాగా వచ్చిన ‘కుబేర’ వరకూ ఒక ప్రత్యేక శైలిని కొనసాగిస్తోంది. సహజమైన కథనం, నిజజీవితానికి దగ్గరైన పాత్రలు, మృదువైన భావోద్వేగాలు ఆయన సినిమాల ప్రత్యేకత.
Sekhar Kammula | టాలీవుడ్లో సెన్సిబుల్ కథలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’తో ప్రారంభమైన ఆయన ప్రయాణం తాజాగా వచ్చిన ‘కుబేర’ వరకూ ఒక ప్రత్యేక శైలిని కొనసాగిస్తోంది. సహజమైన కథనం, నిజజీవితానికి దగ్గరైన పాత్రలు, మృదువైన భావోద్వేగాలు ఆయన సినిమాల ప్రత్యేకత. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. 2007లో విడుదలైన హ్యాపీడేస్ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా సంచలన విజయాన్ని అందుకుంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నలుగురు స్నేహితుల జీవితాలను ఆవిష్కరించిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉండటం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.
ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్ రానుందనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ‘కుబేర’ తరువాత శేఖర్ కమ్ముల రెండు కథలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి ‘హ్యాపీ డేస్ 2’ అని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత జెన్-జీ యువతను దృష్టిలో పెట్టుకుని, ఆధునిక కాలేజ్ లైఫ్, కొత్త తరం ఆలోచనలతో ఈ కథను రూపుదిద్దుతున్నారట. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైందని తెలుస్తోంది. మరోవైపు ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలిగిన కథను కూడా ఆయన రెడీ చేస్తున్నారట. ఈ రెండు కథల్లో ఏది ముందుగా ఫైనల్ అవుతుందో, అదే ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమాల్లో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. రెండు స్క్రిప్ట్‌ల ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తయిన తర్వాతే నటీనటుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకప్పుడు యువతను ఉర్రూతలూగించిన ‘హ్యాపీ డేస్’కి సీక్వెల్ వస్తే, అదే మ్యాజిక్‌ను ఈ తరం ప్రేక్షకుల్లో సృష్టించగలదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

