తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 14న అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ (F-35 stuck in Kerala) నాటి నుంచి అక్కడే ఉన్నది. ఐదోతరం స్టెల్త్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలయ్యాయి. ఆ ఫైటర్ జెట్‌కు మరమ్మతులు చేపట్టేందుకు బ్రిటన్ నుంచి ముప్పై మంది ఇంజినీర్ల బృందం తిరువనంతపురం చేరుకుంటుందని భావించారు. అయితే వారు రాకపోవచ్చని తెలుస్తున్నది.
కాగా, సుమారు 20 రోజులుగా తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిపోయిన ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను బ్రిటన్‌కు తరలించేందుకు ఆ దేశ అధికారులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. నాటి నుంచి సీఐఎస్ఎఫ్ గస్తీలో ఉన్న యుద్ధ విమానాన్ని పాక్షికంగా విడదీసి మిలిటరీ కార్గో విమానం ద్వారా బ్రిటన్‌కు తరలించాలని యోచిస్తున్నారు. ఎఫ్-35 ఫైటర్ జెట్ పునరుద్ధరణ కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నది.
Also Read:
Rs.20 Lakh Worth Car Theft | రూ.20 లక్షల ఖరీదైన కారు నిమిషంలో చోరీ.. వీడియో వైరల్
Watch: రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?