Iran Supreme leader : ఇరాన్ (Iran) లో పరిపాలన చాలా ఏళ్ల తర్వాత సుప్రీం లీడర్ చేతి నుంచి త్రిసభ్య కౌన్సిల్ చేతికి వెళ్లింది. అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) నిర్వహించిన సంయుక్త దాడిలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ప్రాణాలు కోల్పోవడంతో.. తాత్కాలికంగా పరిపాలనా బాధ్యతలు చూడటం కోసం ముగ్గురు సభ్యుల కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా IRNA వెల్లడించింది.
త్రిసభ్య కౌన్సిల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్‌లోని ఒక జ్యూరీ సభ్యుడు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ కౌన్సిల్ తాత్కాలికంగా మాత్రమే ఇరాన్ పరిపాలనా బాధ్యతలను చూడనుంది. గార్డియన్ కౌన్సిల్ అనేది ఇరాన్ సుప్రీం లీడర్ తర్వాత శక్తిమంతమైన విభాగాల్లో ఒకటి. దానిలో 88 మంది సభ్యులు ఉంటారు. వారిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని కూడా వ్యవహరిస్తారు.
ఇరాన్ చట్టం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అధికారం గార్డియన్ కౌన్సిల్‌కు ఉంది. ఈ కౌన్సిల్ సుప్రీం లీడర్ ఎన్నిక కోసం త్రిసభ్య కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తుంది. గార్డియన్ కౌన్సిల్లో ఎనిమిదేళ్ల పదవీకాలంతో షియా మతగురువులు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ గార్డియన్ కౌన్సిలే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు కూడా చూస్తుంది.