Iran Israel Conflict | అమాయకుల ప్రాణాలు బలి కావాలా?.. ఇరాన్ దాడులపై గళమెత్తిన హాలీవుడ్ ప్రముఖులు
Middle East | ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు.
Peace In Middle East | ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. గ్లోబల్ సింగర్ జాక్ వైట్ (Jack White) నుంచి హాలీవుడ్ నటుడు అవెంజర్స్ ఫేమ్ మార్క్ రుఫలో (Mark Ruffalo) వరకు పలువురు సెలబ్రిటీలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేశారు.
ప్రముఖ సంగీత విద్వాంసుడు జాక్ వైట్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. యుద్ధం వల్ల కలిగే వినాశనాన్ని ప్రస్తావిస్తూ, అమాయక ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ నటుడు మరియు సామాజిక కార్యకర్త మార్క్ రుఫలో స్పందిస్తూ.. ఈ దాడుల వల్ల మధ్య ప్రాచ్యంలో (Middle East) మరింత అశాంతి నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఎప్పుడు యుద్ధాల కంటే శాంతికి ప్రాధాన్యత ఇస్తాం. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికన్ నటి సుసాన్ సారండన్ (Susan Sarandon) స్పందిస్తూ.. ఈ దాడులను మానవతా దృక్పథంతో చూడాలని, యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని పేర్కొన్నారు. మరోవైపు హాలీవుడ్ ప్రముఖులు తమ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ఖాతాల్లో #StopTheWar, #PeaceInMiddleEast వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా పడుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

