ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిపై (BrahMos Attack) పాకిస్థాన్ ఆర్మీ స్పందించడానికి ఎలాంటి సమయం లేకపోయింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా ఈ విషయాన్ని అంగీకరించారు. ‘నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారతదేశం బ్రహ్మోస్‌ను ప్రయోగించినప్పుడు, ఆ క్షిపణిలో అణు వార్‌హెడ్ ఉందా లేదా అని విశ్లేషించడానికి పాక్ సైన్యానికి 30-45 సెకన్లు మాత్రమే ఉన్నాయి’ అని పాక్ వార్తా ఛానెల్‌తో అన్నారు.
కాగా, కేవలం 30 సెకన్లలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరమైన పరిస్థితి అని రాణా సనావుల్లా తెలిపారు. ‘వారు (భారత్) అణ్వాయుధాలను ఉపయోగించకపోవడం ద్వారా మంచి చేశారని నేను చెప్పడం లేదు. కానీ అదే సమయంలో ఈ వైపు ఉన్నవారు దానిని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. ఇది ప్రపంచ అణు యుద్ధానికి దారితీసే మొదటి అణ్వాయుధాన్ని ప్రయోగించేందుకు దారితీయవచ్చు’ అని అన్నారు.
మరోవైపు ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను పాక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక చర్యను భారత్ చేపట్టింది. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
కాగా, పాక్ ఆర్మీ ప్రతిస్పందనకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ధీటుగా సమాధానం ఇచ్చింది. సర్గోధా, నూర్ ఖాన్ (చక్లాలా), భోలారి, జకోబాబాద్, సుక్కూర్, రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లకు భారీ నష్టం కలిగిచింది. అయితే నూర్ ఖాన్‌పై భారత్ దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. 1971 యుద్ధంలో ఐఏఎఫ్‌కు చెందిన 20వ స్క్వాడ్రన్ హాకర్ హంటర్లతో ఈ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నది.
Also Read:
speaking Marathi must | మరాఠీ మాట్లాడటం తప్పనిసరి.. మహారాష్ట్ర మంత్రి స్పష్టం
Watch: స్కూల్‌కు వెళ్లేందుకు.. ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాటుతున్న చిన్నారులు