నల్లమల కబ్జా
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూ ర్ రేంజ్ పరిధిలోని దట్టమైన నల్లమల అభయారణ్యం రోజు రోజుకు కుదించుకుపోతున్నది. ఫలితంగా అడవి జంతువులకు సురక్షితమైన నివాసంగా ఉన్న నల్లమలలో దొంగలు పడటంతో అడవి జంతువులు మైదాన ప్రాంతాలకు క్యూ కడుతున్నాయి. అడవి ఆక్రమదారులు రాజకీయ పలుకుబడి ఉన్న వారు కావడంతో ఫారెస్టు అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
- కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 5,966 ఎకరాల అటవీ భూమి ఆక్రమణ
- అటవీ విస్తీర్ణం తగ్గడంతో మైదాన ప్రాంతాలకు అడవి జంతువులు
- ఓటు బ్యాంక్ కోసం ఫారెస్టు అధికారులపై ఒత్తిడి
కొల్లాపూర్, మార్చి 1 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూ ర్ రేంజ్ పరిధిలోని దట్టమైన నల్లమల అభయారణ్యం రోజు రోజుకు కుదించుకుపోతున్నది. ఫలితంగా అడవి జంతువులకు సురక్షితమైన నివాసంగా ఉన్న నల్లమలలో దొంగలు పడటంతో అడవి జంతువులు మైదాన ప్రాంతాలకు క్యూ కడుతున్నాయి. అడవి ఆక్రమదారులు రాజకీయ పలుకుబడి ఉన్న వారు కావడంతో ఫారెస్టు అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
ఇటీవల నల్లమలను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై కేసు లు నమోదు చేసిన అటవీ అక్రమణలో సమూల మార్పులు రాలేదు. రాజకీయ పలుకుబడితో తమకు తిరుగులేదని భా వించిన అధికార పార్టీకి చెందిన నాయకులు నల్లమలను కబ్జా పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు బలం చేకూర్చే వి ధంగా 36815 హెక్టార్లల్లో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వు జోన్‌లోని కొల్లాపూర్ రేంజర్ పరిధిలోనే 5,966ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది.
భారీగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం
కాకులు దూరని కారడవిగా ఉన్న నల్లమల నేడు మై దాన ప్రాంతాన్ని తలపించే విధంగా మారుతోంది. కొ ల్లాపూర్ రేంజ్ పరిధిలోనే ఎక్కువగా నల్లమల ఆక్రమణకు గురవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో అడవి లో జరుగుతున్న అక్రమ కలప రవాణా, ఇసుక అ క్రమ రవాణాను చాలా వరకు కట్టడి చేసింది. అ డవిని రక్షించేందుకు కొత్తగా అడవి జోలికి వెళ్లకుండా ఉండేందుకు మూడుతరాలుగా అడవి భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్న వారికి 710.63 హెక్టార్లలో పో డు పట్టాలు (రికగైనజేషన్ ఆఫ్ ఫారె స్టు రైట్)లను అం దించింది. అడవి ఆక్రమణ జరగకుండా కట్టుదిట్టం చే సింది. ఫలితంగా అడవి విస్తీ ర్ణం కూడా పెరగడంతోపాటు అడవిలో వేటగాళ్ల అలజడి లేకపోవడంతో అడవి జంతువుల వృద్ధి పెరిగినట్లు కూడా అధికార గణంకాల ద్వారా తె లుస్తోంది. బీఆర్ఎస్ ప్రభు త్వం స్థానంలో కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పడటంతో మళ్లీ నల్లమలకు ఆక్రమణదారుల నుంచి ముప్పు ఏర్పడినట్లు పలువురు భావిస్తున్నారు.
అడవి ఆక్రమణ
కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ పరిధిలో 1515 హెక్టార్లల్లో 709 హెక్టార్లలో పోడు పట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ఇచ్చి అడవి అక్రమణకు అడ్డుకట్ట వేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొల్లాపూర్ రేంజ్ పరిధిలో ముఖ్యంగా నార్లాపూర్, చింతలపల్లి, అమరగిరి, సోమశిల సెక్షన్‌ల్లో అడవి ఆక్రమణ ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్లాపూర్ సెక్షన్ పరిధిలో కంపార్ట్మెంట్ 425, 426, 428 నెంబర్లలో అత్యధికంగా అడవి ఆక్రమణకు గురవుతున్నట్లుగా పర్యావరణ ప్రేమికులు ఆరోపిస్తున్నా రు.
నార్లాపూర్ సెక్షన్లో గతేడాది చివరిలో ముక్కిడిగుండం గ్రామానికి చెందిన కొంత మంది అడవి ఆక్రమిస్తుంటే అ డ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై దాడి జరిగిందని స్వయంగా ఫారెస్ట్ అధికారులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫారెస్టు అధికారులు తరలివచ్చి ఆక్రమణదారులు ఆక్రమించిన ఫారెస్టు భూమిని స్వాధీనం చేసుకొని మొక్కలను నాటారు. అలాగే దేవుని బొ క్క వద్ద కొంతమంది గుప్తనిధుల పేరుతో తవ్వకాలు జరుపుతుండగా వారిని పట్టుకొని ఫారెస్టు అధికారులు కేసులు న మోదు చేశారు. కంపార్టుమెంట్ నెంబర్ 459 సోమశిల సెక్ష న్ పరిధిలో కూడా విలువైన ఫారెస్టు భూమిని రాజకీయ ప లుకుబడి కలిగిన నాయకులు ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వెల్లుబడుతున్నాయి. అమరగిరి సెక్షన్ పరిధిలో ఏకంగా బడా పారిశ్రామిక వేత్తలు అడవిని ఆక్రమించారని ప్రజా సంఘాల నాయకులు పెద్దఎత్తున కొల్లాపూర్ పట్టణంలో ఉద్యమాలు నిర్వహించారు.
ఓటు బ్యాంకు కోసం అధికారులపై ఒత్తిడి
యథేచ్చగా అడవి ఆక్రమణ గురవతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజమైన పోడుభూముల రైతులకు మాత్రమే పోడు పట్టాలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా పో డు పట్టాలను పంపిణీ చేసి అడవి రక్షణకు చర్యలు తీసుకుం టే నేడు అధికార పార్టీ నాయకులు అడవిని ఆక్రమిస్తున్న వారికి సహకారం అందిస్తున్నట్లు ఆరోపణాలు ఉన్నాయి. కొ న్నిచోట్ల అధికార పార్టీ నాయకులు కూలీలను పెట్టి అడవిని నరికించి చదును చేసి ఇతరలకు విక్రయిస్తున్నారనే విమర్శ లు కూడా ఉన్నాయి. అడవిని ఆక్రమణ చేస్తున్న వారు, అడ వి ఆక్రమణకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఫారెస్టు అధికారులు ప్రయత్నిస్తే అధికార పార్టీ నాయకత్వం ఓటు బ్యాంకు కోసం అడవి ఆక్రమణ దారులను కాపాడేందుకు ఫారెస్టు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
మైదాన ప్రాంతాలకు అడవి జంతువులు
అడవి విస్తీర్ణం తగ్గిపోతే ప్రమాదపు అంచులలోకి అడవి జంతువులు వెళ్తాయి. ఇటీవల కాలంలో కొల్లాపూర్ రేంజ్ ప రిధిలో అడవి ఆక్రమణతో పాటు హక్కు పత్రాలు ఉన్నాయ ని రాత్రిళ్లు అడవిలో యంత్రాలతో పనిచేస్తుండటంతో అడవిలోని జంతువులు మైదాన పాంత్రాలకు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే నల్లమల నుంచి పెద్దపులి మైదాన ప్రాంతానికి వచ్చి అందరిని కలవర పెట్టింది. పెద్దపులి రావడంతో స మీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పెద్దపులి కాకుండా శాఖాహార జంతువులు ఏవి అడవి దాటి మై దాన ప్రాంతాలకు వచ్చిన వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నాయి. అడవి ఆక్రమణపై కొల్లాపూర్ ఫారెస్టు రేంజర్‌ను అభిప్రాయం తీసుకునేందుకు నమస్తే తెలంగాణ ప్రయ త్నం చేయగా వివరాలను చెప్పేందుకు సంకోచించా రు. ఏది ఏమైనా అడవిని రక్షించినప్పుడు మాత్ర మే వన్యప్రాణి సంరక్షణ జరుగుతుందని జీవన చక్రం కూడా సరైన మార్గంలో నడుస్తోందని పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నకుం డా ఉంటుందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. అడ వి ఆక్రమణకు గురికాకుండా బాధ్య త తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

