DevaKatta | టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన రా అండ్ రస్టిక్ రూరల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సమర్పణలో ‘జోజో’ (Jo Jo) అనే చిత్రం రాబోతుంది. “మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి” అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి నిబంధనలను పట్టించుకోకుండా, కేవలం అన్ఫిల్టర్డ్ ఫన్ కోరుకునే యూత్ మరియు మాస్ ఆడియెన్స్ కోసం ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రంలో కృష్ణ కమల్ (Krishna Kamal), మాహి శ్రీ (Maahi Sri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తి పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో సాగే ఈ విభిన్న కథాకథనాలు, వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. దేవా కట్టా దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా, రైటింగ్ పార్ట్నర్గా పని చేసిన లియో కిరణ్ (Leo Kiran) ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ప్రస్థానం’, ‘మయసభ’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’ వంటి విలక్షణ చిత్రాలను అందించిన విజయ్ కృష్ణ లింగం (Vijay Krishna Lingam) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గుళ్లపల్లి కుమార్ (Gullapalli Kumar) ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో ఎలాంటి మొహమాటం లేని వినోదాన్ని పంచేందుకు ఈ రా అండ్ రస్టిక్ చిత్రం సర్వం సిద్ధం చేసుకుంటోంది.
హెచ్చరిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి!
Proud to Present this raw rustic rural laugh riot “Jo Jo” – written and directed by my proud 1st AD & writing prtnr @ursleokiran, produced by d producer of “Prasthanam”, “Mayasabha”, “Appatlo Okkadundevaadu” and “Needhee Nadhee Oke Katha”… pic.twitter.com/6txIi0GmKH— deva katta (@devakatta) August 14, 2026