Abhishek Vijayakumar: అతని వద్ద 200 ఫోటోలు.. 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం
Abhishek Vijayakumar: పిల్లల లైంగిక వేధింపులకు చెందిన డిజిటల్ మెటీరియల్‌ను సేకరించిన కేసులో భారతీయ సంతతి వ్యక్తి అభిషేక్ విజయ్‌కుమార్‌ను అమెరికా కోర్టు శిక్షించనున్నది. న్యూజెర్సీలోని హాస్బ్రౌక్ హైట్స్‌లో నివాసం ఉండే అతను తన నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద ఉన్న డివైస్‌లో సుమారు 200 ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది.
వాషింగ్టన్: పిల్లల లైంగిక వేధింపులకు చెందిన డిజిటల్ మెటీరియల్‌ను సేకరించిన కేసులో భారతీయ సంతతి వ్యక్తి అభిషేక్ విజయ్‌కుమార్‌ను అమెరికా కోర్టు శిక్షించనున్నది. న్యూజెర్సీలోని హాస్బ్రౌక్ హైట్స్‌లో నివాసం ఉండే అతను తన నేరాన్ని అంగీకరించాడు. రజస్వల దశ దాటని చిన్నారులకు చెందిన ఇమేజ్‌లు, వీడియోలు కూడా కలిగి ఉన్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 2024 మార్చిలో నిందితుడు కావాలనే ఆ మెటీరియల్‌ను సేకరించినట్లు కోర్టులో రుజువైంది. విజయ్‌కుమార్ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్‌ల్లో.. పిల్లల లైంగిక వేధింపులకు చెందిన కనీసం 200 ఇమేజ్‌లు ఉన్నట్లు గుర్తించారు. మూడేళ్ల చిన్నారిని లైంగికంగా వేధిస్తున్న ఓ వ్యక్తి ఇమేజ్ కూడా అతని డివైస్‌లో ఉన్నది.
పిల్లలపై లైంగిక వేధింపులు ఆపేందుకు ఎఫ్‌బీఐ నిరంతరం పోరాటం చేస్తుందని అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఏ టైసెన్ దువా తెలిపారు. పిల్లల లైంగిక వేధింపులకు చెందిన ఇమేజ్‌లు కలిగి ఉన్న కేసులో నిందితుడు విజయ్‌కుమార్‌కు సుమారు 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. 2027, జనవరి ఆరో తేదీన తుది తీర్పు, శిక్షను వెలువరించనున్నారు. అమెరికా శిక్షాస్మృతి మార్గదర్శకాల ప్రకారం శిక్షను ఖరారు చేయనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

