ముంబై: స్కూల్‌కు వెళ్లేందుకు చిన్నారులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఉధృతంగా ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాడుతున్నారు. (Children Cross Gushing River) ఆ నదిపై వంతెన లేకపోవడంతో బడికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ దుస్థితి నెలకొన్నది. వాల్డా గ్రామ విద్యార్థులు చదువుల కోసం ఐదు కిలోమీటర్ల దూరం నడిచి స్కూల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే రఖాడీ నదిపై నిర్మించిన ఆనకట్టపై నడిచి వెళ్తే మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
కాగా, ప్రమాదకరమని తెలిసినప్పటికీ వాల్డా గ్రామానికి చెందిన పిల్లలు తమ భుజాలపై బ్యాగులు మోసుకుని ఉధృతంగా ప్రవహించే రఖాడీ నదిని దాటి స్కూల్‌కు వెళ్తున్నారు. నకర్పాడ, జుగ్రే పాడ గ్రామానికి చెందిన విద్యార్థులు కూడా ప్రాణాలకు తెగించి ఇలాంటి సాహసాలు చేస్తున్నారు. ఆ నదిపై వంతెన లేకపోవడంతో బడికి వెళ్లేందుకు ప్రతిరోజూ అష్టకష్టాలు పడుతున్నారు.
మరోవైపు రఖాడీ నదిపై వంతెన నిర్మించాలన్న గ్రామస్తుల డిమాండ్‌ను పాలకులు చాలాకాలంగా పట్టించుకోవడంలేదు. దీంతో చదువుల కోసం ఆయా గ్రామాల పిల్లలు నిత్యం ప్రమాదకరంగా నదిని దాటాల్సి వస్తున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: With No Bridge, Children Cross Gushing River Daily To Attend School https://t.co/dgL4ndD1Tn pic.twitter.com/PlbK6veyLV
— NDTV (@ndtv) July 3, 2025
Also Read:
speaking Marathi must | మరాఠీ మాట్లాడటం తప్పనిసరి.. మహారాష్ట్ర మంత్రి స్పష్టం