KTR | ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఎంతో కష్టపడి కట్టుకున్నఇళ్లను రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా పేదల ఇళ్లను నేలమట్టం చేస్తోంది. బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను కలిశారు.
ఇళ్లు కోల్పోయిన వెలుగు మట్ట బాధితులను కేటీఆర్, పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 4 వేల మంది పోలీసులతో వచ్చారు. పేద ప్రజలు ఏం చేస్తారు వచ్చి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తున్నారు సార్ అంటూ కేటీఆర్‌తో ఓ యువతి అక్కడి వారి ఆవేదనను పంచుకుంది. మా ప్రతీ భూమికి పట్టాలున్నాయి. నా ఆరో తరగతి నుంచి నేనిక్కడే ఉంటున్నా.. ఇక్కడే 10వ తరగతి కూడా పూర్తయింది. మా నాన్న కూలీకెళ్తరు. మేమిక్కడే ఉంటున్నాం.. కోర్టు ఆర్డర్లను కూడా ధిక్కరించి ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది. మీకు కూలగొట్టిన ప్రతీ ఇల్లు చూపిస్తాం. మా కష్టార్జితం.. మా కన్నీళ్లు.. మా ఆశలు.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
LIVE: వెలుగుమట్ల భూదాన్ భూములలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కూల్చివేతల్లో ఇండ్లను కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
📍ఖమ్మం https://t.co/EHhlGtNpX2
— BRS Party (@BRSparty) February 26, 2026
Virosh Wedding | ఒక్కటైన విరోష్: రాజస్థాన్‌లో వైభవంగా విజయ్-రష్మిక వివాహం!
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం