Virosh Wedding | ఒక్కటైన విజయ్-రష్మిక.. రాజస్థాన్‌లో అంగ రంగ వైభవంగా వివాహం!
VijayDeverakonda | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యినట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, నేడు ఉదయం 10.10 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా రష్మిక మెడలో విజయ్ మూడుముళ్లు వేశారని సమాచారం (ఫైల్ ఫొటో ఏఐ). ఈ వివాహ వేడుక రెండు భిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఉదయం విజయ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం హిందూ పద్ధతిలో పెళ్లి వేడుక పూర్తికాగా, సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారాల ప్రకారం మరోసారి వివాహం జరగనుంది.
ఈ వేడుక కోసం ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. పెళ్లికి ముందు జరిగిన సంబరాల్లో భాగంగా ఈ జంట ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం జరిగిన హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ జంట ఇన్‌స్టా వేదికగా పంచుకోవడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తమ అభిమాన నటులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో నెటిజన్లు ‘విరోష్’ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం అనంతరం, మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా కరెంట్ కట్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

