Rajasthan: స్కూల్లో ఆడుతూ 9 ఏళ్ల విద్యార్థిని మృతి.. గుండెపోటుగా అనుమానించిన డాక్టర్లు
Rajasthan: రాజస్థాన్‌లోని ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 9 ఏళ్ల విద్యార్థిని గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. తోటి విద్యార్థులతో కలిసి స్కూల్ మైదానంలో ఆడుతూ ఆ చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలింది. కార్డియాక్ అరెస్ట్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
జైపూర్: రాజస్తాన్(Rajasthan)లోని నగౌర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 9 ఏళ్ల విద్యార్థని గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సోమవారం ఉదయం గోటాన్ పట్టణంలో జరిగింది. తాల్నాపూర్కు చెందిన అయిదో తరగతి విద్యార్థిని దివ్య బపేడియా.. స్కూల్ మైదానంలో ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఉదయం స్కూల్ ప్రార్థనలు జరగడానికి ముందు తోటి విద్యార్థులతో కలిసి ఆడుతూ కనిపించిన ఆ అమ్మాయి అకస్మాత్తుగా కిండపడిపోవడం అనుమానాలకు తావుతీసింది.
స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆ బాలికను స్కూల్ సిబ్బంది తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. బహుశా గుండెపోటు వల్ల ఆ అమ్మాయి మరణించి ఉంటుందని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. స్కూల్ ఆవరణలో దివ్య ఆడుకుంటున్న సీసీటీవీ ఫూటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఆడుతూనే ఆమె ఒక్కసారి కిందపడిపోయినట్లు ఆ ఫూటేజ్‌లో ఉన్నది. గతంలో ఆ విద్యార్థినికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, శరీరంపై గాయాలు కూడా లేవని, ప్రాథమిక అంచనా ద్వారా కార్డియాక్ అరెస్టు జరిగినట్లు తెలుస్తోందని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇంచార్జీ డాక్టర్ సుక్రామ్ తెలిపారు.
పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు నిరాకరించడంతో ఆ బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ!
Revanth Reddy | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 16-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
మహా విపత్తు… ముంచుకొస్తున్న నీటి ముప్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

