Hockey World Cup | హర్మన్‌ప్రీత్ డబుల్.. ఆరంభ పోరులో వేల్స్‌ను చిత్తు చేసిన భారత్..!
Hockey World Cup : ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్‌కప్‌లో భారత జట్టు(Team India) అదిరే బోణీ కొట్టింది. కొత్త జెర్సీ(కాషాయం రంగు)తో ఆడుతున్న టీమిండియా శనివారం వేల్స్(Wales) జట్టును చిత్తుగా ఓడించింది.
Hockey World Cup : ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్‌కప్‌లో భారత జట్టు(Team India) అదిరే బోణీ కొట్టింది. కొత్త జెర్సీ(కాషాయం రంగు)తో తొలిసారి మెగా టోర్నీలో ఆడుతున్న టీమిండియా శనివారం వేల్స్(Wales) జట్టును చిత్తుగా ఓడించింది. తొలి అర్ధ భాగంలోనే రెండు గోల్స్‌తో స్పష్టమైన ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఏకంగా రెండు గోల్స్ సాధించగా 3-1తో జయభేరి మోగించింది భారత్. ఆరంభం నుంచి గోల్ కోసం ముమ్మరంగా ప్రయత్నించిన వేల్స్ ఆఖరి నిమిషంలో సఫలమై పరువు కాపాడుకుంది.
పురుషుల హాకీ ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. గ్రూప్ డీ లీగ్ దశ తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై సునీల్ తొలి గోల్ అందించాడు. పెనాల్టీ కార్నర్‌ను అతడు సూపర్‌గా డ్రాగ్ ఫ్లిక్ చేశాడు. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్ అందించగా తొలి అర్ధ భాగంలోనే 2-0తో టీమిండియా స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ వేల్స్ ఆటగాళ్లను సమర్ధంగా నిలువరించారు భారత డిఫెండర్లు.
A WINNING START FOR US TO THE WORLD CUP! 💥
The Indian Men’s Team open their FIH Hockey World Cup Belgium & Netherlands 2026 campaign with a 3–1 win over Wales! 🇮🇳🙌
Harmanpreet Singh (2 goals) and Sanjay’s (1 goal) penalty-corner goals scripted India’s victorious start in… pic.twitter.com/qgqlEJuRgF
— Hockey India (@TheHockeyIndia) August 15, 2026
పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ 43వ నిమిషంలో డ్రాగ్ ఫ్లిక్ ద్వారా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. అంతే.. ఆధిక్యం 3-0కు చేరింది. బంతిపై పూర్తి నియంత్రణతో మన డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను అడ్డుకున్నారు. అయితే.. 56వ నిమిషంలో సామ్ వేల్ష్ గోల్ చేయడంతో వేల్స్ ఖాతా తెరిచింది. అప్పటికే సమయం మించిపోవడంతో, హర్మన్‌ప్రీత్ సేన వేల్స్‌పై అలవోక విజయ సాధించింది. గ్రూప్ డీ నుంచి రెండు పాయింట్లు సొంతం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

