అహ్మదాబాద్: సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుజరాత్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో వారి చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు. (Bangladeshi Immigrants Deported) గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్తో పాటు పలు నగరాల్లో బంగ్లాదేశ్ జాతీయులు వేల సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని గుర్తించడానికి గత కొన్ని రోజులుగా స్థానిక పోలీసులతో కలిసి అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వందలాది మంది బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మంది నకిలీ ఆధార్, పాన్ కార్డులు కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు.
కాగా, జూలై 3న సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చేతులను తాళ్లతో కట్టేశారు. గట్టి భద్రత మధ్య వడోదర ఎయిర్ఫోర్స్ బేస్కు వారిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చేతులను తాళ్లతో కట్టి విమానం ఎక్కించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల చేతులు, కాళ్లు కట్టేసి ప్రత్యేక విమానాల్లో భారత్కు పంపిన సంఘటనను ఇది గుర్తుచేసింది.
Gujarat Police, in a bold US-style operation, deported 250 illegal Bangladeshi immigrants from Vadodara via a special Air Force plane.
Caught in Ahmedabad, Surat, and Vadodara, these infiltrators were bound with ropes and flown to Dhaka under tight security. pic.twitter.com/4wVNWYXZ53
— Treeni (@TheTreeni) July 4, 2025
Also Read:
BrahMos Attack | బ్రహ్మోస్పై ప్రతిస్పందించడానికి 30-45 సెకన్లు పట్టింది: పాక్