Dhurandhar 2 | 3 గంటల 40 నిమిషాల యాక్షన్ విందు.. వైరలవుతున్న ‘ధురంధర్ 2’ రన్ టైమ్.!
Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, స్టార్ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివేంజ్' (Dhurandhar: The Revenge) విడుదలకు సిద్ధమవుతోంది.
Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, స్టార్ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివేంజ్’ (Dhurandhar: The Revenge) విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా రన్ టైమ్ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘U/A 16+’ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా నిడివి 220 నిమిషాలుగా ఉన్నట్లు సమాచారం. అంటే ఈ చిత్రం దాదాపు 3 గంటల 40 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్‌తో ప్రేక్షకులను అలరించబోతుంది. మొదటి భాగం (3 గంటల 34 నిమిషాలు) తో పోలిస్తే ఇది 6 నిమిషాలు ఎక్కువ ఉన్నప్పటికీ, ప్రస్తుత కాలంలో అత్యంత సుదీర్ఘమైన నిడివి కలిగిన చిత్రాల జాబితాలో ఇది ఒకటిగా నిలుస్తోంది.
ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే, మొదటి భాగంలో గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డకైట్ను అంతం చేసిన తర్వాత, హమ్జా అలీ మజారీ పాత్రలో రణవీర్ సింగ్ తన తదుపరి లక్ష్యమైన ఐఎస్ఐ (ISI) వ్యూహకర్త ‘బడే సాబ్’ (మేజర్ ఇక్బాల్)ను ఎలా ఎదుర్కొన్నాడు అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ సీక్వెల్ సాగనుంది. రణవీర్ సింగ్‌తో పాటు ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా మరియు అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, సారా అర్జున్ కథానాయికగా నటించింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అదే రోజున కన్నడ స్టార్ యాష్ నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic) కూడా విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొననుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

